Triumph New Bike: ట్రయంఫ్ నుంచి ‘స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్’ మోడల్ కొత్త బైక్.. ధర రూ. 16.95 లక్షలు
Triumph New Bike: మార్కెట్లో రోజురోజుకు సరికొత్త ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వివిధ కంపెనీలు కొత్త మోడల్‌తో బైక్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి...
Triumph New Bike: మార్కెట్లో రోజురోజుకు సరికొత్త ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వివిధ కంపెనీలు కొత్త మోడల్‌తో బైక్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన ప్రీమియం ద్విచక్ర వాహన తయారీ సంస్థ ట్రయంఫ్ సరికొత్త ‘స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్’ మోడల్ బైక్‌ను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.16.95 లక్షలుగా నిర్ణయించింది. 1,160 సీసీ ట్రిపుల్ ఇంజన్‌తో ఈ వాహనం నడుస్తుంది. ఈ బైక్ 10,750ఆర్‌పీఎం వద్ద గరిష్ఠంగా 180 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ ‘స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్‌ఎస్’ బైక్‌లు భారతదేశంలో మాత్రమే ఉంటాయని ట్రయంఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ బైక్‌లు బుక్ చేసుకున్న వారికి మార్చి నెలాఖరు నుంచి డెలివరీ చేస్తామని కంపెనీ వెల్లడించింది.