మరోసారి దిగివచ్చిన బంగారం ధర.. స్వల్పంగా తగ్గిన పసిడి.. భారీ పతనం నమోదు చేసుకున్న వెండి..!

బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే శుక్రవారం ఉదయం కాస్త తగ్గాయి.

మరోసారి దిగివచ్చిన బంగారం ధర.. స్వల్పంగా తగ్గిన పసిడి.. భారీ పతనం నమోదు చేసుకున్న వెండి..!
Gold price today
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 29, 2021 | 8:37 AM

Gold and Silver rates today : వడి వడిగా అడుగు వేసిన పసిడి ధరలు మరోసారి దిగివచ్చాయి. బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే శుక్రవారం ఉదయం కాస్త తగ్గాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా తగ్గుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో పసిడి ధరలు దిగివస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

అయితే, హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్పంగా కిందికి దిగివచ్చాయి. శుక్రవారం ఉదయం 100 రూపాయల మేర తగ్గుదల నమోదు చేసింది. దీంతో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,650 పలికింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం స్వల్ప తగ్గుదల నమోదు చేసుకుని రూ.50,130గా ఉంది.

మరోవైపు, బంగారం ధరలు కాస్త తగ్గితే.. వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరకంటె శుక్రవారం ఉదయం ఏకంగా 4,700 రూపాయలు తగ్గింది. దీంతో 66 వేల రూపాయల స్థాయికి ఒక్కసారిగా వెండి ధరలు కుప్పకూలాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 66,000 రూపాయల వద్దకు చేరుకుంది.

Read Also.. నేటి నుంచే నామినేషన్ల పర్వం.. ఏకగ్రీవాలపై కొనసాగుతున్న వివాదం.. ఆన్‌లైన్‌ నామినేషన్లకి పెరుగుతున్న డిమాండ్‌