Corona Cases Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే..!
Corona Cases Telangana: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 197 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి...
Corona Cases Telangana: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 197 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,94,120కి చేరింది. ఇందులో 2,537 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,89,987 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటిదాకా మొత్తం మరణించిన వారి సంఖ్య 1,596కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 356 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, కొత్తగా జీహెచ్ఎంసీలో 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి…
హైదరాబాద్ నగర ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు.!
ఏపీ: జూన్ 7 నుంచి ‘పది’ పరీక్షలు.. ప్రాధమిక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ.. మే 31 వరకు తరగతులు..