తెలంగాణ ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ.. 45 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలని బీజేపీ శ్రేణుల నిరసనలు
తెలంగాణ ఉద్యోగులకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల న్యాయమైన కోరిక 45శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలని..
తెలంగాణ ఉద్యోగులకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల న్యాయమైన కోరిక 45శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా నిరుద్యోగులకు 2018 డిసెంబరు నుంచి ఇప్పటి దాకా రూ.72వేల భృతి ఇచ్చి.. వచ్చే నెల నుంచే దీనిని ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు మద్దతుగా.. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను సీఎం కేసీఆర్ మోసం చేశారని సంజయ్ ఆరోపించారు.
తన అనుకూల సంఘాలతో చర్చించి వారితో క్షీరాభిషేకం చేయించుకోవాలని సీఎం అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను ముందుపెట్టి, పెండింగ్‌లో ఉన్న ఎన్నో సమస్యలు తెరపైకి రాకుండా సీఎం కుట్ర పన్నారని సంజయ్ విమర్శించారు.