Double Bedroom Houses : నెరవేరుతున్న హైదరాబాదీల సొంతింటి కల.. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం..
నిరుపేదల సొంతిటి కలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చుతోంది. హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు 20 కోట్ల వ్యయంతో నిర్మించిన 264 డబుల్ బెడ్ రూం ఇళ్లను రాష్ట్ర మంత్రులు..
Double Bedroom Houses : నిరుపేదల సొంతిటి కలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చుతోంది. హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు 20 కోట్ల వ్యయంతో నిర్మించిన 264 డబుల్ బెడ్ రూం ఇళ్లను రాష్ట్ర మంత్రులు ఇవాళ ప్రారంభించనున్నారు. గాంధీనగర్‌లో 15.50కోట్ల వ్యయంతో జీ ప్లస్ 3 అంతస్తుల్లో 200 ఫ్లాట్లను నిర్మించింది. ఇందులో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ సాయిరాంనగర్లో రూ.4.96 కోట్ల వ్యయంతో జి+3 అంతస్తుల్లో 64 డబుల్ బెడ్ రూం ఇళ్లను జీహెచ్ఎంసీ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఇళ్లను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కలిసి ప్రారంభించనున్నారు.
ఈ డబుల్ బెడ్ రూంలోఅన్ని రకాల వసతులను ఏర్పాటు చేసింది. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూం ఇళ్లలో ఒక లీవింగ్ రూమ్, రెండు బెడ్ రూమ్లు, ఒక కిచెన్ రూమ్, రెండు టాయిలెట్లు ఏర్పాటు చేసింది. ఒక్కొక్కటి రూ.7.75 లక్షల వ్యయంతో నిర్మించింది. ఈ డబుల్ బెడ్ రూంలను లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తోంది.
ఈ ఇళ్ల కాలనీలో మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, లిఫ్ట్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ, సీసీ రోడ్లు, వీధి దీపాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసింది. గతంలో పూర్తిగా మురికివాడలుగా ఉన్న గాంధీనగర్, సాయిరాం నగర్లలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల ఇక్కడి స్థానికులు ఉన్నత ప్రమాణాలతో కలిగిన గృహాల్లో నివసించనున్నారు.
ఇవి కూడా చదవండి :
ఏపీ పంచాయతీ పోరుః ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ నిబంధనలు తప్పనిసరి..! Master Movie : నష్టాలను భర్తీ చేయాలని కోరుతున్న ‘మాస్టర్’ మూవీ డిస్టిబ్యూటర్లు.. నిర్మాతలు ఏమంటున్నారంటే