భారీ నష్టాలను చవిచూసిన ఇండిగో కంపెనీ.. వినియోగదారుల విశ్వాసం ఉందంటున్న సీఈవో.. కారణాలు ఇలా..

Indigo Company: దేశీయ బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో ఇంకా నష్టాల నుంచి బయటపడలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన

  • uppula Raju
  • Publish Date - 5:32 am, Fri, 29 January 21
భారీ నష్టాలను చవిచూసిన ఇండిగో కంపెనీ.. వినియోగదారుల విశ్వాసం ఉందంటున్న సీఈవో.. కారణాలు ఇలా..

Indigo Company: దేశీయ బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో ఇంకా నష్టాల నుంచి బయటపడలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇండిగో రూ. 620 కోట్ల నష్టాలను నమోదు చేసింది. తక్కువ సామర్థ్యం నేపథ్యంలో ఇండియా ఎయిర్‌లైన్స్ ఆదాయం తీవ్రంగా ప్రభావితమైంది. సమీక్షించిన త్రైమాసికంలో ఇండిగో మొత్తం ఆదాయం 50.2 శాతం క్షీణించి రూ. 5,142 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది కరోనా కారణంగా తీవ్ర నష్టాలను చూస్తున్న ఇండిగో జూన్ త్రైమాసికంలో రూ. 2,884 కోట్లు, సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 1,194 కోట్ల నష్టాలను నమోదు చేసింది. దీంతో ఇండిగో వరుసగా మూడో త్రైమాసికంలోనూ నష్టాలు తప్పలేదు.

గతేడాది ఇదే త్రైమాసికంలో విమానయాన సంస్థ రూ. 496 కోట్ల లాభాలను ఆర్జించింది. ఈ త్రైమాసికంలో ఇండిగో మొత్తం ఖర్చులు 41 శాతం క్షీణ్చాయని, ప్రయాణీకుల టికెట్ల ఆదాయం 53.6 శాతం తగ్గి రూ. 4,069 కోట్లను ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. సంస్థపై వినియోగదారుల విశ్వాసం సానుకూలంగా ఉందని, కోలుకునేందుకు అవసరమైన చర్యలను తీసుకునేందుకు వినియోగదారుల సహకారం ఉంటుందని ఇండిగో సీఈఓ రొనొజోయ్ దత్తా వెల్లడించారు. అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ జరిగితే నష్టాలను అధిగమిస్తామని ఇండిగో ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

HCL Acquisition Of DWS: ఆస్ట్రేలియా కంపెనీని కొనుగోలు చేసిన భారత్‌ టెక్‌ దిగ్గజం.. ఈ డీల్‌ విలువ ఎంతంటే