Toyota Beats Volkswagen: ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వాహ‌నాలు విక్ర‌యించిన ఆటోమేక‌ర్‌గా అవ‌త‌రించిన ట‌యోటా…

జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం టొయోటా మోటార్ కార్ప్ గతేడాది వాహన అమ్మకాలలో జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్‌ను అధిగమించింది...

Toyota Beats Volkswagen: ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వాహ‌నాలు విక్ర‌యించిన ఆటోమేక‌ర్‌గా అవ‌త‌రించిన ట‌యోటా...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 28, 2021 | 10:35 PM

జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం టొయోటా మోటార్ కార్ప్ గతేడాది వాహన అమ్మకాలలో జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్‌ను అధిగమించింది. ఐదేండ్లలో తొలిసారి ప్రపంచంలోనే అత్యధిక వాహనాలు విక్రయించిన ఆటోమేకర్‌గా టయోటా నిలిచింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాహన విక్రయాలు తగ్గినా ఫోక్స్‌వ్యాగన్‌ను గట్టిపోటీనిచ్చిన టయోటా అమ్మకాల్లో అగ్రస్థానాన్ని అందుకున్నది.2020లో గ్రూప్‌ అనుబంధ కంపెనీల సేల్స్‌ 11.3శాతం పడిపోవడంతో 9.528 మిలియన్ల వాహనాలు మాత్రమే అమ్ముడుపోయాయి.

ఇదే సమయంలో వోక్స్‌వ్యాగన్‌ అమ్మకాలు 15.2శాతం క్షీణించడంతో 9.305మిలియన్ల వాహనాలను విక్రయించింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అంతర్జాతీయంగా కొన్నినెలల పాటు వాహనాల తయారీ, విక్రయాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. మా దృష్టి ర్యాంకులపై కాదని, వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే ప్రథమ లక్ష్యమని టయోటా ప్రతినిధి ఒకరు తెలిపారు.