Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో బెస్ట్ ఇదే.. ఏడాదిలో 20శాతం వరకూ రాబడి.. పూర్తి వివరాలు..

ఇటీవల కాలంలో వీటిల్లో ఎక్కువ శాతం మంది పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా లార్జ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లు అధిక లాభాలను తెచ్చిపెడుతోంది. ఇవి సాధారణంగా స్థిరంగా ఉండే ఫండ్లు. మార్కెట్ లో పరిస్థితి ఎలా ఉన్నా మంచి రాబడిని అందిస్తాయి. గతేడాది కాలంలో ఈ లార్జ్ క్యాప్ ఫండ్ల పనితీరు చాలా మెరుగ్గా, ఆశాజనకంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటి? వాటిల్లో పెట్టుబడులు ఎలా పెట్టాలి? తెలుసుకుందాం రండి..

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో బెస్ట్ ఇదే.. ఏడాదిలో 20శాతం వరకూ రాబడి.. పూర్తి వివరాలు..
Mutual Funds
Follow us

|

Updated on: Sep 17, 2023 | 11:00 AM

అధిక రాబడులు ఆశించే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడూ మంచి ఆప్షనే. అయితే దానిలోని రిస్క్ ఫ్యాక్టర్ ను బట్టి ఎక్కువ మంది దానిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపరు. అయితే దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇది ఇస్తుంది. మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా దీనిలో స్వల్పకాలంలో పెట్టుబడులు పెట్టే వారు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ ఇటీవల కాలంలో వీటిల్లో ఎక్కువ శాతం మంది పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా లార్జ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లు అధిక లాభాలను తెచ్చిపెడుతోంది. ఇవి సాధారణంగా స్థిరంగా ఉండే ఫండ్లు. మార్కెట్ లో పరిస్థితి ఎలా ఉన్నా మంచి రాబడిని అందిస్తాయి. గతేడాది కాలంలో ఈ లార్జ్ క్యాప్ ఫండ్ల పనితీరు చాలా మెరుగ్గా, ఆశాజనకంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటి? వాటిల్లో పెట్టుబడులు ఎలా పెట్టాలి? తెలుసుకుందాం రండి..

లార్జ్-క్యాప్ ఫండ్స్ అంటే..

లార్జ్-క్యాప్ ఫండ్స్ అనేది ఈక్విటీ ఫండ్‌లలో భాగం. ప్రధానంగా గణనీయమైన ఆస్తులు కలిగిన అగ్రశ్రేణి కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. దీర్ఘకాలిక సంపద సృష్టిలో ఈ కంపెనీల ట్రాక్ రికార్డ్‌ అద్భుతంగా ఉంటుంది. దీంతో పెట్టుబడి పెట్టే వారికి స్థిరత్వాన్ని, వృద్ధిని అందిస్తాయి. అందుకే ఇవి బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తాయి. ఈ నిధులు స్థిరత్వం, వృద్ధిని కోరుకునే పెట్టుబడిదారులకు నమ్మదగిన ఎంపికలుగా పరిగణించబడతాయి. ఈ సంవత్సరం లార్జ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో అధిక రాబడి వచ్చింది. కొంతమంది ప్రముఖ సంస్థలు దీనిలో ముందున్నాయి.

ఉదాహరణకు నిప్పాన్ లార్జ్ క్యాప్ ఫండ్, ఇది ఒక సంవత్సరంలోనే 20.07% రాబడిని అందించింది. అలాగే హెచ్ డీఎఫ్సీ లార్జ్ క్యాప్ ఫండ్ 16.6% రాబడిని అందించగా, ఎడెల్వీస్ లార్జ్ క్యాప్ ఫండ్ 14.9% రాబడిని ఇచ్చింది. ఆగస్ట్ 8, 2007న స్థాపించబడిన నిప్పాన్ ఫండ్, దాని ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 561.6% రాబడిని అందించింది, ఎనిమిది సంవత్సరాలలో దాని బెంచ్‌మార్క్‌ను 27% అధిగమించింది. దీని తర్వాతహెచ్డీఎఫ్సీ, ఎడెల్వీస్ లార్జ్ క్యాప్ వరుసగా 24.7%, 22% రాబడిని అందించాయి.

ఇవి కూడా చదవండి

పెట్టుబడి రంగంలో అగ్రగామి..

కోవిడ్-19 అనంతర ప్రపంచంలో, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ దశలో ఉంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా లార్జ్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ లార్జ్-క్యాప్ ఫండ్‌లు స్థిరమైన వ్యాపార నమూనాలు, వృద్ధి సాధించిన కంపెనీలలో పెట్టుబడి పెట్టడంలో ఘనమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నాయి. దీంతో పెట్టుబడి రంగంలో లార్జ్-క్యాప్ ఫండ్స్ ను అగ్రగామిగా నిలబెడుతున్నాయి. ఇది ఇంతలా నిలదొక్కుకోడానికి కారణాలు ఏంటని పరిశీలిస్తే.. లార్జ్ క్యాప్ కంపెనీల విశ్వసనీయత, ఖ్యాతి, మరింత స్థిరమైన, అధిక ఆదాయాలను అందించడమేనని నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుంటుంది..

అయితే సాధారణంగా మనం వింటూ ఉంటాం కదా మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఒడిదొడుకులకు లోనవుతుందని.. కొన్ని సందర్భాల్లో మీ సంపద అంతా ఆవిరైపోతుందని అంటుంటారు. ఇది నిజమే. కానీ లార్జ్ క్యాప్ ఫండ్స్ లో ఈ ప్రమాదం కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ పెట్టే కంపెనీలు మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనుకాకుండా స్థిరంగా ఉంటాచి. స్మాల్ మీడియం క్యాప్ ఫండ్స్ తో పోలిస్తే చాలా తక్కువ అస్థిరతను ప్రదర్శిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
హానర్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే ఫీచర్లు..
హానర్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే ఫీచర్లు..
బడ్జెట్‌లో మంచి ఫీచర్ల ఫోన్‌ కోసం చూస్తున్నారా.? ఇదే బెస్ట్‌
బడ్జెట్‌లో మంచి ఫీచర్ల ఫోన్‌ కోసం చూస్తున్నారా.? ఇదే బెస్ట్‌
పిల్లల్ని ఏ వయసు నుంచి స్కూల్‌కి పంపాలో మీకు తెలుసా?
పిల్లల్ని ఏ వయసు నుంచి స్కూల్‌కి పంపాలో మీకు తెలుసా?
కళ్లు చెదిరే ఫీచర్లతో ఒప్పో ఫోన్‌.. ఏమన్నా ఫీచర్సా అసలు..
కళ్లు చెదిరే ఫీచర్లతో ఒప్పో ఫోన్‌.. ఏమన్నా ఫీచర్సా అసలు..
టీ 20 ప్రపంచకప్.. టీమిండియాకు బిగ్ షాక్.. కింగ్ కోహ్లీకి గాయం!
టీ 20 ప్రపంచకప్.. టీమిండియాకు బిగ్ షాక్.. కింగ్ కోహ్లీకి గాయం!
లో బడ్జెట్ హీరోను పెట్టి.. ఓ హై బడ్జెట్ సినిమా తీయ్యోచు..
లో బడ్జెట్ హీరోను పెట్టి.. ఓ హై బడ్జెట్ సినిమా తీయ్యోచు..
పొట్ట గుట్టలా మారిందని బాధపడుతున్నారా..? ఈ సింపుల్ టిప్స్‌తో..
పొట్ట గుట్టలా మారిందని బాధపడుతున్నారా..? ఈ సింపుల్ టిప్స్‌తో..
మంచుకొండల్లో ముద్దగుమ్మ..
మంచుకొండల్లో ముద్దగుమ్మ..
ప్రయాణికుడి లంచ్‌బాక్స్‌లో ఆహారాన్ని చూసి షాక్‌.. రూ.5 లక్షల ఫైన్
ప్రయాణికుడి లంచ్‌బాక్స్‌లో ఆహారాన్ని చూసి షాక్‌.. రూ.5 లక్షల ఫైన్
ఉత్తరాది ఓటర్లను ప్రభావితం చేసేందుకే అమిత్ షా వ్యాఖ్యలు: సజ్జల
ఉత్తరాది ఓటర్లను ప్రభావితం చేసేందుకే అమిత్ షా వ్యాఖ్యలు: సజ్జల
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
విశ్వక్ అండగా బాలయ్య ఉండగా భయమెలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్.
విశ్వక్ అండగా బాలయ్య ఉండగా భయమెలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్.
గుండెలదిరే విక్టోరియా ఫాల్స్‌లో మహిళా వీడియో వైరల్‌.!
గుండెలదిరే విక్టోరియా ఫాల్స్‌లో మహిళా వీడియో వైరల్‌.!
బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.
బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.
ఓటు వేసేందుకు రక్షణ కావాలని ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.
ఓటు వేసేందుకు రక్షణ కావాలని ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.
మహేష్‌బాబు పుత్రోత్సాహం.. విదేశాల్లో గౌతమ్ ఉన్నత విద్యాభ్యాసం.
మహేష్‌బాబు పుత్రోత్సాహం.. విదేశాల్లో గౌతమ్ ఉన్నత విద్యాభ్యాసం.
మోదీ వచ్చారు,హోటల్ లో బస చేసి వెళ్లారు,మరి బిల్లు ఎప్పుడు కడతారు?
మోదీ వచ్చారు,హోటల్ లో బస చేసి వెళ్లారు,మరి బిల్లు ఎప్పుడు కడతారు?
అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.2 కోట్లతో ఉడాయించిన పూజారి..
అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.2 కోట్లతో ఉడాయించిన పూజారి..
ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.
ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.
పోలీస్‌ స్టేషన్‌ లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
పోలీస్‌ స్టేషన్‌ లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..