హ్యూందాయ్ ఎక్స్‌టర్.. పలు రకాల వేరియంట్లో ఈ కారు అందుబాటులో ఉంది. అందులో ఎక్స్‌టర్ ఎస్ఎక్స్ కారు బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ కారులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. 81 బీహెచ్ పీ పవర్, 113ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తోంది. మాన్యువల్, ఏఎంటీ గేర్ బాక్స్ తో వస్తుంది. ఏఎంటీ గేర్ బ్యాక్స్ తో పాటు ప్యాడెల్ షిఫ్టర్ కలిగిన తొలి కారు ఇదే కావడం విశేషం. ఇది సీఎన్జీ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 8.0 ఇన్ఫోటైన్ మెంట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ , ముందు వెనుక స్పీకర్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ కూడా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. పలు క్రాష్ టెస్ట్ లలో ఉత్తమ స్కోర్ సాధించింది. ఎక్స్ టర్ కారు వేరియంట్స్ ధర రూ. 7.13లక్షల నుంచి రూ. 12.08లక్షలు(ఆన్ రోడ్, ముంబై) ఉంటుంది. ఎక్స్‌టర్ ఎస్ఎక్స్ వేరింయట్ మాత్రం రూ. 9.44లక్షలు ఉంటుంది.