- Telugu News Photo Gallery Business photos Vande Bharat sleeper coach and Vande Metro to be rolled out by next year, All You Need To Know Is
Vande Bharat: గుడ్ న్యూస్.. వందేభారత్ స్లీపర్, మెట్రో వచ్చేస్తున్నాయ్.. మరో ఆర్నెళ్లే.!
వందేభారత్ మెట్రో రైళ్లను సాధారణ ప్రయాణీకుల కోసం అందుబాటులోకి రానున్నాయి. ఇవి నాన్-ఏసీ కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ హై-స్పీడ్ వందేభారత్ రైళ్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఈ వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి.
Updated on: Sep 17, 2023 | 11:55 AM

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందించింది ఇండియన్ రైల్వేస్. వచ్చే ఆర్నెళ్లలో వందేభారత్ స్లీపర్, మెట్రో రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఈ విషయాన్ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా తెలిపారు.

వందేభారత్ మెట్రో రైళ్లను సాధారణ ప్రయాణీకుల కోసం అందుబాటులోకి రానున్నాయి. ఇవి నాన్-ఏసీ కాగా, ఈ పుష్-పుల్ రైళ్లకు 22 బోగీలు ఉంటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ హై-స్పీడ్ వందేభారత్ రైళ్లకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఈ వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ బోగీలతో నడుస్తున్న ఈ రైళ్లల్లో.. స్లీపర్ కోచ్ బోగీలను సైతం అమర్చాలని కేంద్ర రైల్వే శాఖ చూస్తోంది. అందులో భాగంగా తయారీని కూడా మొదలుపెట్టింది.

సుదీర్ఘ దూరం ప్రయాణించేవారిని దృష్టిలో పెట్టుకుని మరో ఆర్నెళ్లలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తాజాగా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా తెలిపారు.

అలాగే నాన్-ఏసీ ప్రయాణీకుల కోసం వందేభారత్ సాధారణ్ రైళ్లను నడపనుంది రైల్వే శాఖ. ఇవి పుష్-పుల్ ట్రైన్‌లు కాగా.. ఇందులో ఇంజిన్‌తో పాటు మరో 22 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ ట్రైన్లు అక్టోబర్ 31లోగా స్టార్ట్ చేయనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో, సికింద్రాబాద్-విశాఖపట్నం.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ సర్వీసులు నడుస్తోన్న సంగతి తెలిసిందే.





























