AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Citroen C3 Aircross SUV: తక్కువ ధరలో కాంపాక్ట్ ఎస్‌యూవీ కారు ఇది.. రూ. 10వేలకే బుక్ చేసుకోండి..

సిట్రోయిన్ నుంచి మరో కారు మన దేశీయ మార్కెట్లోకి వచ్చింది. ఎస్‌యూవీ వేరియంట్లో వచ్చిన ఈ మోడల్ కు సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. వాస్తవానికి సిట్రోయిన్ సీ3 ఎయిర్ క్రాస్ ఎస్‌యూవీ పేరిట ఏప్రిల్ 2023లోనే ఈ కారును పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 9.99లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. దీనిని అడ్వాన్స్ లో బుక్ చేసుకోవాలనుకుంటే రూ. 10,000 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Citroen C3 Aircross SUV: తక్కువ ధరలో కాంపాక్ట్ ఎస్‌యూవీ కారు ఇది.. రూ. 10వేలకే బుక్ చేసుకోండి..
Citroen C3 Aircross Suv
Madhu
|

Updated on: Sep 17, 2023 | 11:20 AM

Share

సిట్రోయిన్ నుంచి మరో కారు మన దేశీయ మార్కెట్లోకి వచ్చింది. ఎస్‌యూవీ వేరియంట్లో వచ్చిన ఈ మోడల్ కు సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. వాస్తవానికి సిట్రోయిన్ సీ3 ఎయిర్ క్రాస్ ఎస్‌యూవీ పేరిట ఏప్రిల్ 2023లోనే ఈ కారును పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 9.99లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. దీనిని అడ్వాన్స్ లో బుక్ చేసుకోవాలనుకుంటే రూ. 10,000 చెల్లించాల్సి ఉంటుంది. కొత్త కారు కొనాలనుకొనే వారికి ఇది బెస్ట్ చాయిస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సిట్రోయిల్ సీ3 ఎయిర్ క్రాస్ స్పెసిఫికేషన్లు..

సిట్రోయిన్ సీ3 ఎయిర్ క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా మార్కెట్లోకి వచ్చింది. ఇది రెండు రకాల సీటింగ్ అరేంజ్ మెంట్లతో కూడిన వేరియంట్లను విడుదల చేసింది. ఒకటి 5 సీట్ లేఅవుట్ కాగా మరొకటి 7 సీట్ లే అవుట్ తో వస్తుంది. ఈ కారులో థర్డ్ జెన్ 3 సిలెండర్ 1.2 లీటర్ టర్బో ప్యూర్ టెక్ 110 ఇంజిన్ ఉంటుంది. ఇది 108.5బీహెచ్ పీ పవర్, 190 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది. ఇది లీటర్ పై 18.5 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది.

మూడు వేరియంట్లలో..

సిట్రోయిన్ సీ3 కారు మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. యూ, ప్లస్, మ్యాక్స్ వేరియంట్లలో వస్తోంది, ఈ కారును దాదాపు 90శాతం వరకూ జెన్యూన్ పార్ట్స్ అన్ని ఇండియాలోనివే తయారు చేశామని, ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్టేనని కంపెనీ ప్రకటించింది. ఈ కారు 4323 ఎంఎం పొడవు, 1796ఎంఎం వెడల్పు, 1669ఎంఎం ఎత్తు ఉంటుంది. వీల్ బేస్ 2671ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 200ఎంఎం ఉంటుంది. ఈ కారు పది ఎక్స్ టీరియర్ కలర్ ఆప్షన్లు, రెండు ఇంటీరియర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎక్స్ టీరియర్ కలర్ ఆప్షన్లలో మోనో టోన్(పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినమ్ గ్రే, కాస్మో బ్లూ), డ్యూయల్ టోన్(పోలార్ వైట్ విత్ ప్లాటినమ్ గ్రే రూఫ్, పొలార్ వైట్ విత్ కాస్మో బ్లూ రూఫ్, స్టీల్ గ్రే విత్ పోలార్ వైట్ రూఫ్, స్టీల్ గ్రే విత్ కాస్మో బ్లూ రూఫ్, ప్లాటినమ్ గ్రే విత్ పోలార్ వైట్ రూఫ్, కాస్మో బ్లూ విత్ పోలార్ వైట్ రూఫ్)ఆప్షన్లలో లభిస్తాయి. ఇంటీరియర్ రెండు కలర్లు అనోడైజ్జ్ గ్రే , అనోడైజ్జ్ బ్రాంజ్ తో ఉంటాయి. తక్కువ ధరలో ఎస్ యూవీ కారు కావాలనుకున్న వారికి ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఉండదు. టాప్ క్లాస్ లుక్ తో పాటు హై ఎండ్ ఫీచర్లు ఇందులో ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..