ఓ మై గాడ్…ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ పుచ్చకాయ..! దీని ధరతో ఏకంగా ఓ లగ్జరీ కారునే కొనేయొచ్చు.. దీన్ని ఎక్కడ పండిస్తారో తెలుసా..

ఈ ఖరీదైన పుచ్చకాయ అద్భుతమైన రుచితో పాటు రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. ఇది శరీరం రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఇన్ఫెక్షన్ ఫ్రూట్‌గా  చెబుతున్నారు నిపుణులు. ఇందులో పొటాషియం ఉండటమే కాకుండా విటమిన్ సి, ఫాస్పరస్, విటమిన్ ఎ, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. దీని ధర వందలు వేలు కాదు..లక్షల్లో పలుకుతుంది. ఈ రకం పుచ్చకాయ ధర ఏకంగా మన దేవంలో మహీంద్రా థార్ ధరకు సమానం.

ఓ మై గాడ్...ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ పుచ్చకాయ..! దీని ధరతో ఏకంగా ఓ లగ్జరీ కారునే కొనేయొచ్చు.. దీన్ని ఎక్కడ పండిస్తారో తెలుసా..
Yubari Melon
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 17, 2023 | 3:18 PM

ఆరోగ్య ప్రయోజనాల రిత్యా పండ్లను ఎక్కువగా తింటారు. డాక్టర్లు కూడా ఇదే చెబుతుంటారు. అలాంటి పండ్లు ఎన్నో రకాలు.. వాటిల్లో ఒకటి పుచ్చకాయ. చాలా మందికి ఇష్టమైనది. వేసవికాలంలో మామిడి పండ్ల తరువాత ఎక్కువగా లభించే పండు. అందరికీ ఇష్టమైనది పుచ్చకాయ. ఇందులో మెలోన్ పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకు అద్భుతంగా పని చేస్తుంది. అయితే, పుచ్చకాయ కిలోకు రూ. 100లోపుగానే మార్కెట్‌లో దొరుకుతుంది. కానీ, ఇక్కడో పుచ్చకాయ ధర తెలిస్తే.. షాక్‌ అవుతారు.. దాని ధర చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే..

వాటర్‌ మిలన్‌కు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటూనే ఉంటుంది. సాధారణంగా ఈ పండు ఏప్రిల్ నుండి మే వరకు కిలోకు రూ. 50 నుండి రూ. 60 వరకు లభిస్తాయి. కొన్నిసార్లు దాదాపు రూ. 100కి చేరుకుంటాయి. అయితే, ఈ రోజు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వెరైటీలలో ఒకటైన ఈ పుచ్చకాయ ఖరీధు చాలా కాస్ట్లీ. ఈ ప్రత్యేకమైన పుచ్చకాయను జపాన్‌లో ప్రత్యేకంగా పండిస్తారు. దీనిని ‘యుబారి కింగ్’ అని పిలుస్తారు. ఇది జపాన్‌లోని హక్కైడో ద్వీపంలోని యుబారి నగరంలో మాత్రమే పండించబడే ప్రపంచంలోనే అత్యంత విలువైన పండు.. ఇక్కడి నగర వాతావరణం యుబారి పుచ్చకాయ సాగుకు అనువైనది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

యుబారి కింగ్ అసాధారణ రుచికి ప్రసిద్ధి..

ఇవి కూడా చదవండి

యుబారి నగరంలో పగలు, రాత్రి మధ్య భారీ ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలో తేడా ఎంత ఎక్కువగా ఉంటే పుచ్చకాయ అంత తియ్యగా, రుచిగా ఉంటుందని చెబుతున్నారు. యుబారి కింగ్‌ని వేరు చేసేది ఏమిటంటే అది కేవలం అమ్ముడవ్వడమే కాకుండా వేలం వేస్తారు. 2022 సంవత్సరంలో ఒక యుబారి కింగ్‌ పుచ్చకాయ వేలంలో రూ. 20 లక్షల ఆశ్చర్యకరమైన ధర పలికింది.  అంతకు ముందు సంవత్సరం ఒక యుబారి కింగ్ పుచ్చకాయ ధర రూ.18 లక్షలకు అమ్ముడుపోయింది.  మనదేశంలో SUV Mahinda థార్ ధర రూ. 12 నుండి 20 లక్షల మధ్య ఉంటుంది.

యుబారి కింగ్‌లో అద్భుతమైన రుచితో పాటు రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. ఇది శరీరం రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఇన్ఫెక్షన్ ఫ్రూట్‌గా  చెబుతున్నారు నిపుణులు. ఇందులో పొటాషియం ఉండటమే కాకుండా విటమిన్ సి, ఫాస్పరస్, విటమిన్ ఎ, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..