Chandrababu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన చంద్రబాబు.. ఐదు రోజులుగా జైల్లోనే.. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే..
ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం అమలైంది. ఈ కార్యక్రమం బాగా అమలైందంటూ కేంద్రం అవార్డులు కూడా ఇచ్చింది. 2,17,500 మంది యువత ఐదు క్లస్టర్ల ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారు. 65 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు వచ్చాయి. ఇంత గొప్ప కార్యక్రమంలో అవినీతి జరిగిందని..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన చంద్రబాబు.. ఐదు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు. కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించి.. బాబును జైలులో పెట్టారని ఆరోపిస్తున్న టీడీపీ గల్లీల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. మరోవైపు ఈ విషయాన్ని ఢిల్లీ స్థాయిలో చర్చించుకునేలా చేయాలనే ఉద్ధేశంతో ఢిల్లీ వెళ్లారు నారా లోకేష్. జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఢిల్లీ టూర్‌కు వెళ్లిన లోకేష్.. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగుతోందన్న విషయాన్ని జాతీయస్థాయిలో హైలైట్ చేసే పనిలో పడ్డారు లోకేష్. చంద్రబాబుపై కేసులు, ఏపీలో పరిస్థితుల గురించి జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మరోవైపు చంద్రబాబు కేసుల గురించి లీగల్ టీంతో చర్చిస్తున్నారు లోకేష్. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. అనుసరించాల్సిన కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు లోకేష్. అలాగే పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులతోనూ చంద్రబాబు కేసు విషయంపై చర్చిస్తారని తెలుస్తోంది.
మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించింది టీడీపీ. ap skill development truth.com పేరుతో లాంచ్ చేసిన ఈ వెబ్‌సైట్‌లో అన్ని డాక్యుమెంట్లు అందుబాటులో ఉంచింది. 2014లో స్కిల్ డెవలప్‌మెంట్ ఒప్పందం జరిగిన దగ్గర నుంచి చంద్రబాబు అరెస్ట్ వరకు అన్ని విషయాలు రాయడమే కాకుండా.. డాక్యుమెంట్లు కూడా వెబ్‌సైట్‌లో పెట్టింది. వైసీపీ నేతల ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని చెప్తోంది టీడీపీ.
ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం అమలైంది. ఈ కార్యక్రమం బాగా అమలైందంటూ కేంద్రం అవార్డులు కూడా ఇచ్చింది. 2,17,500 మంది యువత ఐదు క్లస్టర్ల ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారు. 65 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు వచ్చాయి. ఇంత గొప్ప కార్యక్రమంలో అవినీతి జరిగిందని వైసీపీ మాట్లాడటం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపైనా ఆయన మాట్లాడారు.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళ్లే అంశంపై త్వరలోనే పూర్తి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జనసేన, టీడీపీ నాయకులు కలిసి ఉమ్మడి పోరాటం చేస్తున్నారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..