Green Tea: గర్భిణులు గ్రీన్ టీ తాగితే ఏమవుతుంది..? కడుపులో శిశువుకు..!
గర్భం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక దశ. ఈ సమయం ప్రతి స్త్రీ జీవితంలో మరో జన్మతో సమానం అంటారు. అంతేకాదు.. అనేక మార్పులకు శ్రీకారం.. అందుకే ఈ సమయంలో ఆహారం, ఆరోగ్యం, శరీరంలోనూ అనేక మార్పులు రావడం సహజం. ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు తీపి, మరికొందరు పులుపు, కొందరు ఉప్పగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో గ్రీన్ టీ తాగాలా వద్దా ..?
గత కొన్ని సంవత్సరాలుగా గ్రీన్ టీ ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. ఇతర టీలతో పోలిస్తే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా గ్రీన్ టీలో అనేక ఇతర పోషకాలు (ప్రోటీన్లు) కూడా ఉన్నాయి. గ్రీన్ టీ బరువు తగ్గడం, గుండె సంరక్షణ, జుట్టు, చర్మ సంరక్షణకు మంచి పరిష్కారం. అయితే, గ్రీన్ టీ గర్భిణీ స్త్రీలకు సహాయపడుతుందా..? గర్భిణీలు గ్రీన్ టీ తాగొచ్చ అనే సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి. గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగాలా వద్దా అనే అనేక ప్రశ్నలు ప్రజల మదిలో తలెత్తుతాయి. ఎందుకంటే..గర్భం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక దశ. ఈ సమయం ప్రతి స్త్రీ జీవితంలో మరో జన్మతో సమానం అంటారు. అంతేకాదు.. అనేక మార్పులకు శ్రీకారం.. అందుకే ఈ సమయంలో ఆహారం, ఆరోగ్యం, శరీరంలోనూ అనేక మార్పులు రావడం సహజం. ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు తీపి, మరికొందరు పులుపు, కొందరు ఉప్పగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో గ్రీన్ టీ తాగాలా వద్దా అనే అనేక ప్రశ్నలకు సమాధానం ఇక్కడ తెలుసుకుందాం..
గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగడం సురక్షితం. గర్భధారణ సమయంలో 3 నుండి 4 కప్పుల గ్రీన్ టీ తాగాలి. గర్భధారణ సమయంలో కెఫిన్ తీసుకోవడం 200 mg కంటే తక్కువగా ఉండాలి. ఒక కప్పు గ్రీన్ టీలో 35 mg కెఫిన్ ఉంటుంది. అందుకే గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అంతేకాకుండా, ఇది ఆందోళన, ఒత్తిడిని తగ్గించడానికి మంచిది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ, గర్భిణీ లు దీనిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరం.
గ్రీన్ టీ తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో వికారం రాకుండా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా పనిచేస్తుంది. కాబట్టి గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడంలో తప్పులేదు. అంతేకాకుండా, గ్రీన్ టీ కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని జీవనశైలిలో చేర్చుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గ్రీన్ టీ ఇన్సులిన్, చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం తల్లి, బిడ్డ ఇద్దరికీ ముఖ్యమైనది. దీని లోపం వల్ల పిల్లల పూర్తి మెదడు అభివృద్ధి సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో మీరు తగినంత గ్రీన్ టీ తీసుకుంటే మీ బిడ్డకు ఫోలిక్ యాసిడ్ పూర్తి ప్రయోజనం లభించదు.
గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల ఐరన్ శోషణ సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాక తల్లీ బిడ్డకు రక్తహీనత (అనీమా) వచ్చే అవకాశం ఉంది.అంతేకాకుండా జీవక్రియ పెరిగితే అది తల్లి, బిడ్డ ఇద్దరిపైనా ప్రభావం చూపుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..