Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చరిత్ర పుటల్లోకి డబుల్‌ డెక్కర్‌ బస్సు.. రెడ్‌ బ్యూటీకి ఎమోషనల్‌ వీడ్కోలు పలికిన నగర ప్రజలు..

1997లో మొదటి డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్సు పర్యాటకం కోసం ప్రారంభించబడింది. ఈరోజు ఈ డబుల్ డెక్కర్ బస్సు ఆఖరి ప్రయాణం చేసింది. ఈ బస్సుతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ స్థానిక ప్రజలు, ప్రయాణికులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ బస్సుతో చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయంటూ ప్రయాణికులు గుర్తు చేసుకున్నారు.

చరిత్ర పుటల్లోకి డబుల్‌ డెక్కర్‌ బస్సు.. రెడ్‌ బ్యూటీకి ఎమోషనల్‌ వీడ్కోలు పలికిన నగర ప్రజలు..
Mumbai Double Decker Bus
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 15, 2023 | 8:57 PM

ఆ బస్సు అంటే అక్కడి ప్రజలకు ఫుల్ ఎమోషన్. ఒకప్పుడు ముంబయి వాసుల లైఫ్ లైన్. ముంబైకి ల్యాండ్ మార్క్ గా నిలిచిన రెడ్ కలర్ డబుల్ డెక్కర్ బస్సుకు బృహన్ ముంబై ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ వీడ్కోలు పలకడంతో సోషల్ మీడియా వేదికగా ముంబై వాసులు పెద్ద సంఖ్యలో వీడ్కోలు చెబుతున్నారు. ముంబయి ప్రజల ఆయువుపట్టు అయిన రెడ్ కలర్ డబుల్ డెక్కర్ బస్సుకు బృహన్‌ ముంబై ట్రాన్స్‌ పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ గుడ్‌ బై చెప్పింది. ఈ రోజుతో రెడ్‌ కలర్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు ప్రయాణం ముగిసిందంటూ సెండ్‌ ఆఫ్‌ చెబుతున్నారు. రెడ్‌ బ్యూటీకి వీడ్కోలు అంటే ముంబై ప్రజలు ఎమోషన్‌ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గ్రేటర్ ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ సప్లై & ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నగరం చివరిగా నడుస్తున్న డబుల్ డెక్కర్ బస్సును స్వాధీనం చేసుకుంది. సెప్టెంబర్‌15న తెల్లవారుజామున మారోల్ డిపోలో ఈ నాన్-ఎసి బస్సును బెస్ట్ స్వాధీనం చేసుకుంది. బెస్ట్ ఈ డబుల్ డెక్కర్ బస్సుల స్థానంలో రాబోయే 9 నెలల్లో సిటీ ట్రాఫిక్ సిస్టమ్‌లో 900 ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెస్తుంది. కానీ ఇప్పటికే ఉన్న ఈ డబుల్ డెక్కర్ బస్సు చాలా సంవత్సరాలుగా ముంబై పర్యాటకానికి తనదైన సహకారాన్ని అందించింది. ముంబైకి విహారయాత్రకు వచ్చిన వారందరూ ఒక్కసారైనా ఈ బస్సు ఎక్కినందుకు సంతోషించారు.

ఇవి కూడా చదవండి

1997లో మొదటి డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్సు పర్యాటకం కోసం ప్రారంభించబడింది. అయితే ఈ డబుల్ డెక్కర్ పూర్తిగా ఆగిపోదని, కొత్త ప్లాన్ తో ఈ డబుల్ డెక్కర్ మళ్లీ రానుందని బీఈటీఎస్ తెలిపింది. ఈరోజు ఈ డబుల్ డెక్కర్ బస్సు ఆఖరి ప్రయాణం చేసింది. ఈ బస్సుతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ముంబై వాసులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ బస్సుతో చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయంటూ ప్రయాణికులు గుర్తు చేసుకున్నారు. లేచి కూర్చుని విహంగ వీక్షణం చేసే రోజులు పోయాయి’ అని మరొకరు వ్యాఖ్యానించారు.

ఈ బస్సుతో చాలా మంది సోషల్ మీడియా యూజర్లు తమ పాత జ్ఞాపకాల్లోకి జారిపోయారు. ఇది నా కాలేజీ రోజులను గుర్తుచేస్తోందని, బస్సు పై సీట్లపై కూర్చోవడం సరదాగా ఉందని ఓ మహిళ వ్యాఖ్యానించింది. ఇది మాత్రమే కాదు, చాలా బాలీవుడ్ సినిమాలలో పాత హిందీ పాటలలో ఈ బస్సు సన్నివేశం ఉంది. షాన్, జానే బి దో, అర్జున్, జానే బి దో, నాయక్ రియల్ హీరో, తారే జమీన్ పర్ మొదలైన సినిమాలో ఈ డబుల్ డెక్కర్ బస్సు కనిపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…