Hyderabad: ట్రైన్ లో దొంగతనాలు చేసే ముఠాను అరెస్ట్ చేసిన సికింద్రాబాద్ పోలీసులు.. భారీగా బంగారం సీజ్
Secunderabad: ప్టెంబర్ 13 న ఉదయం 9గంటలకు క్రైమ్ సిబ్బంది & RPF సిబ్బందితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నెం.10లో అనుమానితులు, నేరస్థుల కోసం తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద స్థితిలో కనిపించిన ఇద్దరు వ్యక్తులు షోల్డర్ బ్యాగులతో తిరుగుతూ కనిపించారు. పోలీసులు వెతుకుతున్న నేరస్తుల ఆనవాళ్లు వీరితో సరిపోవటంతో అదుపులోకి తీసుకొని విచారించగా
హైదరాబాద్, సెప్టెంబర్15: అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. రైలు ప్రయాణికులే టార్గెట్ గా రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను సికింద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడిన వారిలో 22 ఏళ్ళ మోతిలాల్ రెడ్డప్ప పవార్ సిమెంట్ కంపెనీలో లేబర్ గా పని చేస్తూ పూణే లో నివాసం ఉంటున్నాడు. అతనికి తోడు 33ఏళ్ళ సంజయ్ సుభాష్ రాథోడ్ లేబర్ పని చేస్తూ పూణే లోనే ఉంటున్నాడు. ఇద్దరి స్వస్థలం కర్ణాటక కాగా బ్రతుకుతెరువు కోసం మహారాష్ట్ర వెళ్లారు. వీరి వృత్తి లేబర్ పనే అయినా ప్రవృత్తి మాత్రం ట్రైన్లో దొంగతనం చేయటం. ఈ నెల 13 న సారు ఉదయం 9 గంటలకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నెం.10పై వీరు అనుమానాస్పదంగా తిరగట రైల్వే పోలీసులు గమనించారు. వీరి కదలికలను గమనించిన ఎస్సై శ్రీను వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు సికింద్రాబాద్,నాంపల్లి రైల్వే స్టేషన్ లోని ప్లాట్‌ఫారమ్‌లపై ఆగి ఉన్న రైళ్లలో స్నాచింగ్,దొంగతనం చేస్తున్నట్టుగా ఒప్పుకున్నారు.
సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో ఇప్పటి వరకు రెండు చైన్ స్నాచింగ్ లు, 9 దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు. రైల్వే స్టేషన్‌లలో మహిళా ప్రయాణికులు మరియు రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటారు, రైల్వే స్టేషన్‌లో ఎవరైనా అమాయక ప్రయాణీకులు కనిపిస్తే వెంబడిస్తారు. దీనిలో సంజయ్ సుభాష్ రాథోడ్ పరిసరాలను గమనిస్తూ ఉంటారు. ఇక మోతి లాల్ కదులుతున్న రైళ్లు, ఆగి ఉన్న రైళ్లలో బంగారు ఆభరణాలను అపహరించడం మరియు ప్రయాణీకుల బ్యాగులను దొంగిలించడం చేస్తుంటాడు.
అసలు వీళ్ళు ఎలా దొరికారో తెలుసా..
దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చిన రైళ్లలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన రైల్వే పోలీసులు ఇద్దరు నేరస్థులను గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సెప్టెంబర్ 13 న ఉదయం 9గంటలకు క్రైమ్ సిబ్బంది & RPF సిబ్బందితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నెం.10లో అనుమానితులు, నేరస్థుల కోసం తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు షోల్డర్ బ్యాగులతో తిరుగుతూ కనిపించారు. పోలీసులు వెతుకుతున్న నేరస్తుల ఆనవాళ్లు వీరితో సరిపోవటంతో అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు.
నిందితుల వద్ద నుంచి మొత్తం 309 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వీరిద్దరిపై 11 కేసులు నమోదయ్యాయి. ట్రైన్ లో ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని విలువైన వస్తువులు తీసుకెళ్లకపోవడం మంచిదని పోలీసులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..