Viral Post: కూతురి కోసం ఎదురు చూస్తూ 9 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి..! ఈ సారి ఏకంగా కవలలు..!?
సోషల్ మీడియాలో యలన్సి ట్రోల్‌గా మారారు. కవలలు పుడతారని చెప్పగానే రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు నెటిజన్లు. ఇవేమీ యాలాన్సియాకు పట్టడం లేదు. ఈ పిల్లలందరినీ పెంచడానికి నా దగ్గర డబ్బు ఉంది. మా కుటుంబానికి నెల జీతం 2200 డాలర్లు అని యలాన్సి చెప్పింది. దీన్ని హాయిగా సర్దుబాటు చేస్తున్నామని యలన్సి తెలిపారు.
మగపిల్లైనా, ఆడపిల్లైనా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కొందరు కోరుకుంటారు. మరికొందరికి మగపిల్లలు కావాలనే కోరిక ఉంటుంది. అలాగే కొందరికీ ఆడపిల్ల పుట్టాలనే కోరిక ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మంది మగబిడ్డ కావాలని మగబిడ్డ కోసం ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారు కూతుర్లను నిర్లక్ష్యం చేస్తుంటారు.ఆడ పిండాన్ని కూడా గర్భంలోనే చిదిమి వేసే క్రూరులు కూడా ఉంటారు. మగబిడ్డ కోసం ఎంతో మంది దేవుళ్లను వేడుకుంటారు. ఇలా వారు నేటికీ మనచుట్టూ చాలా మందే ఉన్నారు. మగబిడ్డకు జన్మనివ్వలేదన్న కారణంతో మహిళలను అత్తవారింటి నుండి బయటకు గెంటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో కాస్త మార్పు వచ్చింది. కూతుళ్లతో పాటు కొడుకులను కూడా ప్రజలు సంతోషంగా ఆదరిస్తున్నారు. ఆడపిల్ల పుడితే పండగ చేసుకుని సంబరాలు చేసుకునేవారూ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అలాంటి విషయాలు పలుమార్లు వార్తల్లో, సోషల్ మీడియాలో చూశాం. అయితే, ఇక్కడో తల్లి కూడా ఆడపిల్ల కోసం పెద్ద సాహసమే చేసింది. ఆడపిల్ల పుట్టలేదని ఒకరు ఇద్దరు, నలుగురు, ఐదుగురు కాదు..ఏకంగా తొమ్మిది మంది మగపిల్లలకు జన్మనిచ్చింది. 9 మంది పిల్లల తల్లి ఇప్పుడు మళ్లీ గర్భవతి. ఈ జంట టెక్సాస్‌లో నివాసం ఉంటున్నారు.
టెక్సాస్‌లో నివసిస్తున్న ఓ మహిళ 9 ఏళ్లలో 9 మంది కుమారులకు జన్మనిచ్చింది. ఆ మహిళ పేరు యలాన్సియా రోసారియో. ఆమె వయసు కేవలం 30 సంవత్సరాలు. యలాన్సియాకు కూతురు కావాలనే బలమైన కోరికతో ఉంది.. కానీ ఆమె కోరిక నెరవేరడం లేదు. కుమార్తె కావాలనే కోరికతో యలన్సియా 9 మంది కుమారులకు జన్మనిచ్చింది. కాగా ఈ ఏడాది మళ్లీ గర్భవతి అయింది. త్వరలో తాను కవలలకు జన్మనివ్వబోతున్నట్లు యలాన్సియా తెలిపింది. ఈ ఏడాది తనకు కచ్చితంగా కూతురు కానుక వస్తుందని ఆశిస్తుంది. యలాన్సియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కవలల స్కాన్ పోస్ట్‌ను కూడా షేర్ చేసింది. ఆడపిల్ల పుట్టే వరకు నేను పిల్లలను కంటూనే ఉంటానని యలాన్సియా చెప్పింది.
య్లాన్సియా పిల్లల వయస్సు ఎంత? :
యెలాన్సియా మొదటి బిడ్డ వయస్సు 12 సంవత్సరాలు. జమేల్ పెద్ద కొడుకు. మైఖేల్ జూనియర్ వయస్సు 9 సంవత్సరాలు. ఏంజెలో వయస్సు 8 సంవత్సరాలు. అర్మానీకి 6 సంవత్సరాలు. ప్రిన్స్ వయస్సు 5 సంవత్సరాలు. సిన్సియర్ వయస్సు 3 సంవత్సరాలు. మరో కొడుకు వయసు 2 సంవత్సరాలు. ఇప్పుడు గిమానీకి 1 సంవత్సరం, కైరోకి 2 నెలల వయస్సు.
యలాన్సియా తన సోషల్ మీడియా ఖాతాలో పిల్లలతో కలిసి ఉన్న చాలా ఫోటోలను షేర్ చేసింది. రోసారియో 18 సంవత్సరాల వయస్సులో తన మొదటి కుమారుడికి జన్మనిచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా గర్భం దాల్చుతోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో గర్భం, ఆరోగ్య వివరాలను కూడా షేర్ చేస్త్ఉంది. ఒకసారి ఆమెకు గర్భస్రావం జరిగిందని చెప్పింది.
సోషల్ మీడియాలో యలన్సి ట్రోల్‌గా మారారు. కవలలు పుడతారని చెప్పగానే రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు నెటిజన్లు. ఇవేమీ యాలాన్సియాకు పట్టడం లేదు. ఈ పిల్లలందరినీ పెంచడానికి నా దగ్గర డబ్బు ఉంది. మా కుటుంబానికి నెల జీతం 2200 డాలర్లు అని యలాన్సి చెప్పింది. దీన్ని హాయిగా సర్దుబాటు చేస్తున్నామని యలన్సి తెలిపారు.