Viral Video: 9వ ఎక్కంతో కుస్తీ పడుతున్నారా.. ఈ చిన్నారి చెప్పిన సింపుల్ చిట్కా పాటించి చూడండి
ఈ వీడియోలో ఓ చిన్నారి క్లాస్ రూమ్‌లో బోర్డుమీద తొమ్మిదవ ఎక్కం రాసింది. అందుకు మొదట ఆ చిన్నారి బోర్డుపై 1 X 9 = అని రాసి దాని ఎదురుగా ఆన్సర్ రాయలేదు. అలా వరుసగా 9 X 9 వరకూ రాసింది. కానీ వాటి ముందు ఆన్సర్ రాయలేదు. తర్వాత 2 X 9 = దగ్గరనుంచి మొదలు పెట్టి 1 నుంచి 8 వరకూ నెంబర్లు వాటి ఎదురుగా రాసుకొచ్చింది.
ప్రతిఒక్కరిలో ఏదో ఒకట్యాలెంట్ దాగి ఉంటుంది. అది ఎప్పుడో అప్పుడు బయటపడుతుంది. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో అలాంటి ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ వీడియో చిన్నారి ఎంతో ఈజీగా బోర్డుపైన 9వ ఎక్కం రాసేసింది. అది చూసి నెటిజన్లు అరే.. ఇన్నాళ్లూ ఈ తొమ్మిదో ఎక్కం చదవడానికి ఎంత కష్టపడ్డామో…అని నోరెళ్లబెడుతున్నారు.
ఈ వీడియోలో ఓ చిన్నారి క్లాస్ రూమ్‌లో బోర్డుమీద తొమ్మిదవ ఎక్కం రాసింది. అందుకు మొదట ఆ చిన్నారి బోర్డుపై 1 X 9 = అని రాసి దాని ఎదురుగా ఆన్సర్ రాయలేదు. అలా వరుసగా 9 X 9 వరకూ రాసింది. కానీ వాటి ముందు ఆన్సర్ రాయలేదు. తర్వాత 2 X 9 = దగ్గరనుంచి మొదలు పెట్టి 1 నుంచి 8 వరకూ నెంబర్లు వాటి ఎదురుగా రాసుకొచ్చింది.
The beauty and symmetry of mathematics. pic.twitter.com/rrVQj8qldK
— Vala Afshar (@ValaAfshar) October 22, 2022
ఆ తర్వాత కిందనుంచి మళ్లీ రివర్స్‌లో 1 నుంచి 9 వరకూ నెంబర్లు రాసుకుంటూ వెళ్లింది. ఇప్పుడు టేబుల్ మొత్తం కరెక్ట్‌గా వచ్చిందా..? మీరే చెక్ చేసుకోండి. ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..