AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral Video: ఐస్‌ క్రీం పార్టీ ఎంజాయ్‌ చేస్తున్న కోతుల గుంపు.. వీడియో చూస్తే నవ్వి నవ్వి కడుపుబ్బి పోవాల్సిందే..

కోతులు చేస్తున్న ఐస్‌ క్రీం పార్టీని చూసిన చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై ఫన్నీ రియాక్షన్స్ కూడా ఇచ్చారు. ఒక వినియోగదారు.. పార్టీని ఎలా ఆస్వాదించాలో వాటికి బాగా తెలుసునని అంటుంటే..మరో వినియోగదారులు..ఈ కోతులకు దంత క్షయం, పళ్లు జివ్వుమనే సమస్యలేవీ లేన్నట్టున్నాయ్‌..అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ఐస్ క్రీం కోసం ఎగబడుతున్న కోతుల గుంపు..

Watch Viral Video: ఐస్‌ క్రీం పార్టీ ఎంజాయ్‌ చేస్తున్న కోతుల గుంపు.. వీడియో చూస్తే నవ్వి నవ్వి కడుపుబ్బి పోవాల్సిందే..
Monkeys Enjoyed Ice Cream P
Jyothi Gadda
|

Updated on: Sep 15, 2023 | 3:12 PM

Share

ఐస్‌ క్రీం అనగానే అందరూ ఎగిరి గంతేస్తారు.. చాలా మందికి ఐస్‌ అంటే చాలా ఇష్టం. ఇక వేసవి కాలంలో ఐస్ క్రీం అంటే ఇష్టపడని వారు దాదాపుగా ఎవరూ ఉండరనే చెప్పాలి. ఐస్ క్రీం అంటే అన్ని వయసుల వారు ఇష్టపడి తింటారు. అయితే కొంత మంది మాత్రం చలి, అనారోగ్య కారణ వల్ల కొందరు ఐస్‌ క్రీంకి దూరంగా ఉంటున్నారు. కానీ, చాలామంది తమ ఆరోగ్యాన్ని కొన్ని క్షణాలు పక్కన పెట్టి దాని రుచిని, చల్లదనాన్ని ఆస్వాదిస్తారు. మనుషులు మనుషులే కానీ జంతువులకు కూడా ఐస్ క్రీం దొరికితే ఆనందంగా ఆస్వాదిస్తాయంటే నమ్ముతారా..? ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి. ఐస్‌క్రీమ్‌ని చూసిన కోతులు దాని కోసం ఎలా ఎగబడుతున్నాయో..చూస్తుండగానే మొత్తం ఊడ్చేశాయి. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

కోతుల గుంపు చల్లని ఐస్‌క్రీమ్‌పై కన్నేసింది. ఐస్‌ క్రీం తినేందుకు అవి ఎగబడుతున్నాయి. ఐస్‌ క్రీం బండి కనిపించగానే..అటు వైపు పరిగెత్తి తనకిష్టమైన ఐస్ క్రీం తీసుకుని తినడం మొదలు పెట్టాయి. అక్కడ బండిలో చాలా ఐస్ క్రీంలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కోతుల గుంపు ఐస్‌క్రీమ్ తినేందుకు ఎగబడుతుండటంతో..ఎవరూ వాటిని అడ్డుకోలేకపోయారు. కోతులన్నీ ఆత్రంగా ఐస్‌క్రీం తింటూ ఎంజాయ్‌ చేస్తున్నాయి. . కోతులు, వాటి పిల్లలు కూడా గెంతుతూ ఐస్ క్రీం తింటూ సంబరపడుతున్నాయి. కోతులన్నీ కలిసి ఐస్ క్రీమ్ పార్టీని ఎలా ఎంజాయ్ చేశాయో మీరే చూండి..

ఇవి కూడా చదవండి

వీడియోలో కొందరు వ్యక్తులు కోతులను పిలిచి వాటికి ఐస్‌క్రీం తినిపిస్తున్నారు. ఆ ఐస్‌ క్రీం డబ్బాలో రెండు రంగుల ఐస్ క్రీంలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకటి తెలుపు, ఒక గులాబీ రంగు. కోతులు తమ ఇష్టానుసారం ఐస్‌క్రీమ్‌ను ఎంచుకొని ఆనందించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో @AMAZlNGNATURE అనే ఖాతా వినియోగదారు ద్వారా ‘X’లో షేర్‌ చేశారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 14 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. యూజర్లు ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చారు.

కోతులు చేస్తున్న ఐస్‌ క్రీం పార్టీని చూసిన చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై ఫన్నీ రియాక్షన్స్ కూడా ఇచ్చారు. ఒక వినియోగదారు.. పార్టీని ఎలా ఆస్వాదించాలో వాటికి బాగా తెలుసునని అంటుంటే..మరో వినియోగదారులు..ఈ కోతులకు దంత క్షయం, పళ్లు జివ్వుమనే సమస్యలేవీ లేన్నట్టున్నాయ్‌..అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ఐస్ క్రీం కోసం ఎగబడుతున్న కోతుల గుంపు అల్లరిని నెటిజన్లు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. భిన్నమైన కామెంట్స్ కూడా చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..