హెయిర్ డై అవసరం లేదు.. వేర్ల నుండి తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి అద్భుత ఆయిల్..!
తెల్ల జుట్టు సమస్యను పరిష్కరించే సొరకాయ ఆయిల్ తయారీ కోసం...ముందుగా సోరకాయను పొట్టుతో పాటు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను బాగా ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిపోయిన సొరకాయ ముక్కలను పొడిలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాణలిలో
ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలిపోవటం, తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. చిన్న వయసులోనే నెరసిపోయిన జుట్టు అందరినీ ఇబ్బందులకు గురిచేస్తుంది. తెల్ల జుట్టు వృద్ధాప్యానికి సంకేతం. ప్రస్తుతం చిన్న పిల్లలు సైతం తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో అందం తగ్గుతుంది. తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే రకరకాల కెమికల్ హెయిర్ డైని వాడుతున్నారు. వీటిని వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు సోరకాయతో తయారు చేసిన నూనెను వాడితే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇదేంటీ కొత్తగా సొరకాయతో తెల్లజుట్టుకు పరిష్కారం ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదా..? కానీ, దీని గుణాలు అనేక రకాల జుట్టు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు సొ రకాయతో తయారు చేసిన కొబ్బరి అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సొరకాయ నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
తెల్ల జుట్టు సమస్యను పరిష్కరించే సొరకాయ ఆయిల్ తయారీ కోసం…ముందుగా సోరకాయను పొట్టుతో పాటు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను బాగా ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిపోయిన సొరకాయ ముక్కలను పొడిలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాణలిలో 250 గ్రాముల కొబ్బరి నూనెను వేసుకుని వేడి చేయాలి. ఇలా వేడిచేసిన కొబ్బరి నూనెలో ముందుగా సిద్ధం చేసుకున్న సోరకాయ పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ నూనెను జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాల తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా జుట్టుకు పట్టిస్తూ ఉంటే క్రమంగా తెల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి.
అంతేకాదు..ప్రతి రోజు సోరకాయ జ్యూస్ తాగటం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సొరకాయలో ఉండే నీటి శాతం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సొరకాయలో మాంగనీస్, సెలీనియం, విటమిన్ సి, రిబోఫ్లావిన్, థియామిన్, పాంతోతేనిక్ యాసిడ్ , విటమిన్ బి6 , నియాసిన్ , ఫోలేట్ , శక్తి ఉంటాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో సొరకాయ జ్యూస్ తాగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో అదనపు కొవ్వు ఈజీగా కరిగిపోతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..