Watch Video: మద్యం ట్యాంకర్లలో పేలుడు.. ఏరులై పారిన 6 వేల గ్యాలన్ల రెడ్‌వైన్.. ఎర్రటి ప్రవాహంతో ఉలిక్కి పడ్డ స్థానికులు..
ఒక గ్రామం రహదారిపై 6,00,000 గ్యాలన్ల రెడ్ వైన్ అకస్మాత్తుగా ప్రవహించడం ప్రారంభించింది. రోడ్డుపై అతివేగంగా ప్రవహిస్తున్న ఈ రెడ్‌వైన్‌ను చూసి ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో మద్యం రోడ్డుపై నదిలా ప్రవహిస్తోంది. 2000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ నగరంలో, కొండ ప్రాంతం నుండి ఎర్రటి మద్యం దిగువకు పారుతూ వచ్చింది.
రోడ్డుపై ఎర్రటి నది ప్రవహిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది షాక్ అవుతున్నారు. ఇదేంటిది రోడ్డుపై ఇలాంటి వరద ప్రవహిస్తోందని ఆశ్చర్యపోతున్నారు. ఒక్కసారిగా చూసిన వాళ్లంతా.. ఇది రక్తపు నది అని అని భయపడిపోయారు. కానీ, ఇక్కడ ప్రవహిస్తుంది రక్తం కాదు..రోడ్డు వెంట ప్రవహించే నీరు ఏ నదికీ సంబంధించినది కూడా కాదు..అయితే, ఇలాంటి వరద ఎక్కడ్నుంచి వచ్చింది..? ఇది ఏంటి..? అని చాల మంది సందేహపడ్డారు. నిజానికి ఈ వైరల్ వీడియో పోర్చుగల్‌లోని ఓ తీరప్రాంత గ్రామం. ఇక్కడ సావో లోరెంజో డి బైరో గ్రామంలోని వీధుల్లో మీరు చూసే ఎరుపు రంగు నీరు.. నీరు కాదు, రెడ్ వైన్ ప్రవహించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
పోర్చుగల్‌లోని వైనరీలోని రెండు ట్యాంకుల్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. దీని కారణంగా సావో లోరెంజో డి బైరోలోని ఒక గ్రామం రహదారిపై 6,00,000 గ్యాలన్ల రెడ్ వైన్ అకస్మాత్తుగా ప్రవహించడం ప్రారంభించింది. రోడ్డుపై అతివేగంగా ప్రవహిస్తున్న ఈ రెడ్‌వైన్‌ను చూసి ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో మద్యం రోడ్డుపై నదిలా ప్రవహిస్తోంది. 2000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ నగరంలో, కొండ ప్రాంతం నుండి ఎర్రటి మద్యం దిగువకు పారుతూ వచ్చింది.
గత ఆదివారం జరిగిన ఈ సంఘటనతో రోడ్డుకే కాకుండా చుట్టుపక్కల పొలాలు, గుంతలు, గొయ్యిలు, మట్టి, నేలమాళిగలు చాలా దెబ్బతిన్నాయి. ఈ సంఘటనపై లెవిరా డిస్టిలరీ సోమవారం తన ప్రకటనను విడుదల చేసింది. తమ సంస్థకు చెందిన రెండు ట్యాంకులలో పేలుడు కారణంగా సంభవించిందని పేర్కొంది. ఈ ఘటనపై లెవిరా డిస్టిలరీ విచారం వ్యక్తం చేసింది. నష్టాన్ని భర్తీ చేయడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దీంతో పాటు పేలుడుకు గల కారణాలను కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
డిస్టిలరీ క్లీనింగ్, మరమ్మతుల కోసం ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పొలాల్లో మద్యంతో తడిసి చెడిపోయిన మట్టిని ప్రత్యేక ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు తరలించారు. 22 లక్షల లీటర్ల రెడ్‌వైన్ నేలపాలైనట్టుగా చెబుతున్నారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు.
The streets of Levira, Portugal were flooded with red wine after a distillery’s 2.2 million liter tanks burst.
— Pop Base (@PopBase) September 11, 2023
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..