Watch Viral Video: ఎరా..ఎర్ర చొక్కా.. నువ్వే నా ముందుకొచ్చావ్‌.. కుర్రాడిని ఓ ఆటాడుకున్న ఏనుగు..

ఆ పక్షుల్ని చూసిన ఏనుగు కాస్త తడబడినట్టుగా ప్రవర్తిస్తుంది. దాంతో ఆటోలో ఉన్న వ్యక్తి భయపడిపోతాడు.. ఆ ఏనుగు ఎక్కడ తనపై దాడి చేస్తుందోననే భయంతో ఆటోలోంచి దిగి పరుగులుపెట్టాడు.. అతన్ని చూసిన ఏనుగు కూడా ఒక్క క్షణం భయపడిపోతుంది. ఏనుగు కూడా భయంతో వెనక్కి పరుగులు పెడుతుంది.. ఆటోలోంచి దిగిన వ్యక్తి కూడా ఏనుగును తిరిగి చూస్తూ పరుగులుపెడుతున్నాడు.. ఆ మరుక్షణంలోనే..

Watch Viral Video: ఎరా..ఎర్ర చొక్కా.. నువ్వే నా ముందుకొచ్చావ్‌.. కుర్రాడిని ఓ ఆటాడుకున్న ఏనుగు..
Elephant Attack
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 13, 2023 | 6:23 PM

మీరు ఎప్పుడైనా అటవీప్రాంతంలో ఆటోలో ప్రయాణించారా..? చుట్టూ పచ్చటి చెట్లుతో చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణిస్తుంటే.. ఆ ఆనందం చెప్పలేనిది..అయితే, అలాంటి అటవీ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే.. ఎందుకంటే.. అక్కడి రహదారులపై ఎప్పుడు ఎక్కడ్నుంచి ఎలాంటి జంతువులు వచ్చి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. అలాంటి ఘటనలకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వీడియోలను చూశాం. అడవి మార్గంలో వెళ్తున్న కార్లు, లారీలు, బస్సులపై అడవి జంతువు దాడిచేసిన ఘటనలు కూడా సోషల్ మీడియాలో అనేకం వైరల్‌ కావటం చూశాం. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇక్కడో భారీ ఏనుగు ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తికి మధ్య జరిగిన సంఘర్షణ. ఇటీవల వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియో వైరల్ అవుతుంది.

వీడియోలో కనిపించినట్టుగా అది అటవీ ప్రాంతంగా తెలుస్తుంది. అడవి మధ్యలో ఉన్న రోడ్డుపై ఓ ఆటో వెళ్తోంది.. ఆటోకు అటువైపుగా కాస్త దూరంలో చెట్ల మధ్యలోంచి ఓ ఏనుగు రోడ్డుపైకి ఎక్కింది. అయితే, అప్పటికే రోడ్డుపై కొన్ని పక్షలు నడుచుకుంటూ వెళ్తుండటం కనిపించింది. అయితే, ఆ పక్షుల్ని చూసిన ఏనుగు కాస్త తడబడినట్టుగా ప్రవర్తిస్తుంది. దాంతో ఆటోలో ఉన్న వ్యక్తి భయపడిపోతాడు.. ఆ ఏనుగు ఎక్కడ తనపై దాడి చేస్తుందోననే భయంతో ఆటోలోంచి దిగి పరుగులుపెట్టాడు.. అతన్ని చూసిన ఏనుగు కూడా ఒక్క క్షణం భయపడిపోతుంది. ఏనుగు కూడా భయంతో వెనక్కి పరుగులు పెడుతుంది.. ఆటోలోంచి దిగిన వ్యక్తి కూడా ఏనుగును తిరిగి తిరిగి చూస్తూ పరుగుపెడుతున్నాడు.. ఆ మరుక్షణంలోనే ఏనుగు ముందుకు సాగింది..ఆటోలోంచి దిగి పారిపోతున్న ఆ వ్యక్తిని వెంబడిస్తుంది..

ఏనుగు తన వెంటపడుతుండటంతో అతడు మరింత భయంతో పరుగులు తీశాడు. అప్పటికే దూరంగా ఓ కారులో ఉన్న కొందరు వ్యక్తి ఇదంతా వీడియో తీస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తులే అతన్ని ఏనుగు బారి నుండి రక్షించినట్టుగా వీడియో చూస్తే అర్థమవుతుంది.

అదృష్టవశాత్తూ, గందరగోళం, ప్రమాదం మధ్య విధి మనిషికి అనుకూలించిందని వీడియో చూసిన పలువురు నెటిజన్లు వ్యాఖ్యనించారు. ప్రమాదం అంచునుండి తృటిలో క్షేమంగా తప్పించుకున్నాడు అంటూ మరికొందరు నెటిజన్లు అంటున్నారు. నిజానికి @dhana_tiger2 హ్యాండిల్‌తో ఒక వినియోగదారు Instagramలోఈ వీడియో షేర్‌ చేశారు. కాగా, వీడియోకి భారీగా లైకులు, వ్యూస్‌ వచ్చి చేరుతున్నాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ స్టైల్లో స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?