Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Bharat: పేరు మార్చుకున్న బ్లూ డార్ట్.. రివ్వున పెరిగిన స్టాక్.. ఇకపై ఈ పేరుతోనే సేవలు!

సెప్టెంబర్ 18 నుండి ఐదు రోజుల పాటు జరిగే ప్రత్యేక సమావేశంలో కేంద్ర ప్రభుత్వం దేశం పేరును కూడా మార్చనుందని వార్తలు వచ్చాయి. ఇండియాకు బదులు భారత్‌ అనే పేరును ప్రభుత్వం పెడుతుందని అంటున్నారు. దానితో పాటు జీ20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న టేబుల్ ముందు ఇండియా అనే పేరుకు బదులు భారత్ అని రాశారు.

India vs Bharat: పేరు మార్చుకున్న బ్లూ డార్ట్.. రివ్వున పెరిగిన స్టాక్.. ఇకపై ఈ పేరుతోనే సేవలు!
Blue Dart
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 13, 2023 | 4:21 PM

భారత దేశంలోని ప్రముఖ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్, డాయిష్ పోస్ట్ డీహెచ్ఎల్ గ్రూప్‌లో భాగమైన బ్లూడార్ట్ తన పేరును మార్చుకుంది. ప్రస్తుతం ఇండియా పేరును భారత్‌గా మార్చే అంశంపై రాజకీయంగా చర్చనడుస్తోంది.. ఇలాంటి టైమ్‌లోనే ప్రముఖ ఎక్స్‌ప్రెస్ కొరియర్ సర్వీస్ బ్లూ డార్ట్ ఎవరూ ఊహించని విధంగా తమ బ్రాండ్ పేరు మారుస్తూ ప్రకటన చేసింది.. బ్లూ డార్ట్ నుంచి భారత్ డార్ట్‌గా మార్చుతున్నట్లు ప్రకటించింది. ఈ వ్యూహాత్మక మార్పు బ్లూ డార్ట్ ప్రయాణంలో కీలక మైలురాయిగా కంపెనీ పేర్కొంది. ప్రజల విభిన్న అవసరాలను తీర్చేందుకు తమ నిబద్ధతను నొక్కి చెబుతుందని పేర్కొంది బ్లూ డార్ట్‌.బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ భారత్‌ను ప్రపంచానికి, ప్రపంచాన్ని భారత్‌కు అనుసంధానం చేస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తుంది. ప్రస్తుతం కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 220 దేశాల్లో తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుత ఈ పరివర్తన ప్రయాణంలో చేరేందుకు అన్ని వాటాదారులను ఆహ్వానిస్తున్నట్టుగా బ్లూడార్ట్‌ ప్రకటనలో పేర్కొంది.

ఇటీవల జీ20 సదస్సుకు వచ్చిన నేతలతో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఈ ఆహ్వాన పత్రికలో భారత రాష్ట్రపతికి బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పదాలు ఉన్నాయి. కాగా, ఇది ఇప్పుడు రాజకీయ సమస్యగా మారింది.

దీంతో పాటు, సెప్టెంబర్ 18 నుండి ఐదు రోజుల పాటు జరిగే ప్రత్యేక సమావేశంలో కేంద్ర ప్రభుత్వం దేశం పేరును కూడా మార్చనుందని వార్తలు వచ్చాయి. ఇండియాకు బదులు భారత్‌ అనే పేరును ప్రభుత్వం పెడుతుందని అంటున్నారు. దానితో పాటు జీ20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న టేబుల్ ముందు ఇండియా అనే పేరుకు బదులు భారత్ అని రాశారు. ఈ తరుణంలో బ్లూ డార్ట్ తమ బ్రాండ్ పేరును భారత్ డార్ట్‌గా మార్చుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.