Vande Bharat Express Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో మరో 9 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు..! ఎక్కడంటే..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 రూట్లలో నడుస్తున్నాయి. అంతే కాకుండా మరో 9 రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ కొత్త రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసినట్టుగా సమాచారం. G20 సమ్మిట్‌కు ముందు, G20 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధుల బృందం గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి, ప్రయాణ అనుభవం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Vande Bharat Express Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో మరో 9 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు..! ఎక్కడంటే..
Vande Bharat Express
Follow us

|

Updated on: Sep 12, 2023 | 9:38 PM

Vande Bharat Express Trains: దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక గుర్తింపును పొందింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం వందేభారత్‌. కాగా, దేశంలో త్వరలో మరో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని భారతీయ రైల్వే తెలిపింది. వందేభారత్ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 రూట్లలో నడుస్తున్నాయి. అంతే కాకుండా మరో 9 రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ కొత్త రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసినట్టుగా సమాచారం. ట్రాక్‌పైకి వచ్చే కొత్త రైళ్లలో ఎక్కువ భాగం ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లకు వెళ్తాయి. ఇందుకోసం రైల్వే మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాల్లోనూ భారీ కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రెండు రాష్ట్రాల్లోనూ పలు రైళ్లు ఒకేసారి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

అయితే, భారతీయ రైల్వేలు కొత్తగా ప్రారంభించనున్న 9 వందే భారత్ రైళ్లలో 5 రైళ్ల మార్గాలను విడుదల చేసింది. ఆ మార్గాలు ఇలా ఉన్నాయి.

రూట్ 1: ఇండోర్ – జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 2: జైపూర్-ఉదయ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 3: పూరి – రూర్కెలా వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 4: పాట్నా-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్

రూట్ 5: జైపూర్-చండీగఢ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

భారతీయ రైల్వేల అందించిన సమాచారం మేరకు..వీటిలో ఐదు మార్గాలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కోసం ఇప్పటికే కేటాయించబడ్డాయి. వీటితో పాటు, మూడు మార్గాలు దక్షిణ రైల్వేకు ఇవ్వబడ్డాయి. అయితే, కొత్త వందే భారత్ రైళ్లను ఏ రాష్ట్రానికి అందిస్తారో ఇంకా ఖరారు కాలేదు. అంతే కాకుండా చివరి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కడికి ఎక్కించాలనేది ఇంకా నిర్ణయించలేదని సమాచారం.

ఇవి కూడా చదవండి

దక్షిణ రైల్వే అందుకున్న 3 రైళ్లలో ఒకటి మంగళూరు-తిరువనంతపురం అని సమాచారం. ఈ మార్గంలో కొత్త రైలును ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు.

G20 సమ్మిట్‌కు ముందు, G20 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధుల బృందం గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి, ప్రయాణ అనుభవం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు