Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits: కాళ్ళకి పట్టీలు ఎందుకు వేసుకోవాలి.. సంప్రదాయమే కాదు.. ఇలాంటి రోగాలకు దివ్యౌషధం..!

ఇకపోతే, సంస్కృతి సంప్రదాయాల ప్రకారం.. కాళ్లకు వెండి పట్టీలు మాత్రమే ధరించాలి. బంగారు పట్టీలను మాత్రం ఎలాంటి పరిస్థితులలో కూడా ధరించకూడదని చెబుతున్నారు. కాళ్లకు వేసుకునే పట్టీలు విడుదల చేసే సౌండ్ పాజిటివ్ ఎనర్జీని కూడా ప్రభావితం చేస్తుంది. కాలికి పట్టీలు పెట్టుకుని ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే.. లక్ష్మీ దేవి నట్టింట తిరుగుతున్నట్లు ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు..నిపుణుల అభిప్రాయం ప్రకారం,

Health Benefits: కాళ్ళకి పట్టీలు ఎందుకు వేసుకోవాలి.. సంప్రదాయమే కాదు.. ఇలాంటి రోగాలకు దివ్యౌషధం..!
Wearing Silver Anklets
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 12, 2023 | 9:19 PM

మన సంప్రదాయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి. విశ్వవ్యాప్తంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు గౌరవం ఉంటుంది. వివిధ దేశాధి నేతాలు కూడా మన సంప్రదాయాన్ని అనుసరిస్తుంటారు. అలాంటి సంప్రదాయాల్లో ఒకటి.. వెండి చీలమండలు ధరించడం మహిళలకు ఆభరణంగా పరిగణించబడుతుంది. చాలా మంది భారతీయ మహిళలు పాదాలకు వెండి పట్టిలు ధరిస్తారు. అవి ఖచ్చితంగా మీ పాదాల అందాన్ని పెంచుతాయి. కానీ అవి మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయని మీకు తెలుసా..? కాళ్లకు వేసుకునే పట్టీలు విడుదల చేసే సౌండ్ పాజిటివ్ ఎనర్జీని కూడా ప్రభావితం చేస్తుంది. కాలికి పట్టీలు పెట్టుకుని ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే.. లక్ష్మీ దేవి నట్టింట తిరుగుతున్నట్లు ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు..నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాదాలకు బరువైన వెండి పట్టీలు ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ పాయింట్లను తగ్గించవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మహిళలు శారీరకంగా, మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. కాళ్లకు పట్టీలు ధరించడం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం..

హార్మోన్ల సమతుల్యతకు మంచిది..

నేటి ఆహారం, జీవనశైలి కారణంగా చాలా మంది మహిళలు హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నారు. దీనివల్ల సంతానలేమి, పీరియడ్స్ క్రమం తప్పడం వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వెండిపట్టీలు ధరించడం ద్వారా హార్మోన్లు సమతుల్యమవుతాయి. రుతుక్రమ సమస్యలు మొదలు.. సంతానంలో వచ్చే సమస్యలు, గర్భసంచిలో వచ్చే సమస్యల నుంచి మీరు కాళ్లకు వేసుకునే పట్టీలు మిమ్మల్ని కాపాడుతాయి.అలాగే.. రోగనిరోధక శక్తిని కూడా వెండి పట్టీలు పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

కాళ్ల నొప్పులను దూరం చేస్తుంది..

ఉద్యోగం చేసే మహిళల నుంచి గృహిణి వరకు అందరూ రోజంతా చాలా కదలాల్సి ఉంటుంది. దీని కారణంగా మహిళలు తమ కాళ్ళలో నొప్పిని అనుభవిస్తుంటారు. కాళ్లకు పట్టీలు వేసుకోవటం ద్వారా మీరు కాళ్ల నొప్పి నుండి ఉపశమనం పొందుతారు. ఇది శారీరక బలహీనతను కూడా తొలగిస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండటానికి వెండి పట్టీలు సహాయపడతాయి. అలాగే రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది

మడమ వాపు తగ్గుతుంది..

హైహీల్స్ ధరించడం వల్ల మడమలు తరచుగా ఉబ్బుతాయి. దీని కారణంగా కొంతమందికి మడమల కండరాలలో సమస్యలు తలెత్తుతుంటాయి. కాలి వేళ్లలో నొప్పి మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో కాళ్లకు వెండిపట్టీలు ధరించడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇవి పాదాల వాపును తగ్గిస్తాయి.

ఇకపోతే, సంస్కృతి సంప్రదాయాల ప్రకారం.. కాళ్లకు వెండి పట్టీలు మాత్రమే ధరించాలి. బంగారు పట్టీలను మాత్రం ఎలాంటి పరిస్థితులలో కూడా ధరించకూడదని చెబుతున్నారు. ఎందుకంటే..బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు..కాబట్టి బంగారు పట్టీలను పాదాలకు ధరించడం వల్ల అమ్మవారిని అవమానపరిచినట్టు అవుతుందని.. పండితులు అంటున్నారు.. అందుకోసమే పాదాలకు బంగారు పట్టీలు ధరించకూడదని పండితులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..