Coronavirus Update: కోవిడ్ పిరోలా వేరియంట్ ముప్పులో దేశ రాజధాని..! తాజా సర్వేలో షాకింగ్ రిపోర్ట్..

రాజధానిలో ప్రతి రెండు కుటుంబాలలో ఒకరు గత 3 వారాలుగా ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రతి రెండు ఇళ్లలో ఒకరు ఫ్లూ, వైరస్, కోవిడ్‌తో బాధపడుతున్నట్టుగా ఇటీవల నిర్వహించిన సర్వే వెల్లడించింది. చాలా మంది ప్రజలు జ్వరం,గొంతునొప్పి, తలనొప్పి, ముక్కు కారటం, కీళ్లనొప్పులు, ఒళ్లు నోప్పులు, శ్వాసకోశ సమస్యలు, వైరల్ ఫీవర్ లక్షణాలతో అవస్థలు పడుతున్నారు. తాజా నివేదికల ప్రకారం కరోనా ఇంకా ముగియలేదు. మళ్లీ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందంటున్నారు నిపుణులు.

Coronavirus Update: కోవిడ్ పిరోలా వేరియంట్ ముప్పులో దేశ రాజధాని..! తాజా సర్వేలో షాకింగ్ రిపోర్ట్..
Delhi Ncr Covid
Follow us

|

Updated on: Sep 12, 2023 | 10:08 PM

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు గత 3 వారాలుగా వైరల్ ఫీవర్ సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధుల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆగస్టు రెండో వారంలో స్థానిక సర్కిళ్ల ద్వారా సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఫలితాలు షాకింగ్ రిపోర్ట్‌ని వెల్లడించాయి. అంటే ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని ప్రతి రెండు ఇళ్లలో ఒకరికి ఫ్లూ, వైరల్ లేదా కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇక సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 50 శాతానికి చేరుకుంది. స్థానిక సర్కిల్‌ల ద్వారా నిర్వహించిన తాజా సర్వే ప్రకారం, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కోవిడ్, ఫ్లూ, జ్వరం వేగంగా విస్తరిస్తున్నాయి. అలాగే ఢిల్లీకి ఆనుకుని ఉన్న గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాలకు కూడా ఈ వ్యాధి విస్తరిస్తోంది. స్థానిక సర్కిల్‌లు నిర్వహించిన సర్వే ప్రకారం 50 శాతం ఇళ్లలో ఒకరి నుండి ముగ్గురు వ్యక్తులు కోవిడ్, ఫ్లూ, వైరల్ జ్వరం లక్షణాలతో అనారోగ్యంతో ఉన్నారు.

నివేదిక ప్రకారం, గత ఒక నెలలో దేశ రాజధానిలో ఫ్లూ, వైరల్, కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. చాలా మంది జబ్బుపడినవారు కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించకపోవడం వ్యాధి వ్యాప్తికి దారితీస్తుంది. ఫ్లూ, వైరల్, కోవిడ్‌ల వ్యాప్తి ఈ ప్రాంతంలో కొత్త కోవిడ్ వేరియంట్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతుందని సర్వేలో తేలింది. దేశ రాజధానిలో ప్రతి రెండు కుటుంబాలలో ఒకరు గత 3 వారాలుగా ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ప్రతి రెండు ఇళ్లలో ఒకరు ఫ్లూ, వైరస్, కోవిడ్‌తో బాధపడుతున్నట్టుగా ఇటీవల నిర్వహించిన సర్వే వెల్లడించింది. చాలా మంది ప్రజలు జ్వరం,గొంతునొప్పి, తలనొప్పి, ముక్కు కారటం, కీళ్లనొప్పులు, ఒళ్లు నోప్పులు, శ్వాసకోశ సమస్యలు, వైరల్ ఫీవర్ లక్షణాలతో అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో 61 శాతం మంది ప్రజలు ఇలాంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారని, వారంతా జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల వైరస్‌ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని సర్వేలో వెల్లడైంది.  BA.2.86 పేరుతో, పిరోలా అనే మారుపేరుతో కొత్త వేరియంట్ ప్రస్తుతం US, UKతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కలకలం సృష్టిస్తోంది.

BA.2.86 పిరోలా వేరియంట్ ఒమిక్రాన్ నుండి చాలా భిన్నంగా ఉంటుంది. దాని ముందు ఉన్న ఆల్ఫా, డెల్టా వేరియంట్‌లకు చాలా పోలికతో ఉంటుంది. BA.2.86 పిరోలా ద్వారా ప్రభావితమైన వారు శ్వాసలో సమస్య, వాసన, రుచిని కోల్పోతారు. దీంతో తాజా నివేదికల ప్రకారం కరోనా ఇంకా ముగియలేదు. మళ్లీ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందని చెప్పకనే చెబుతున్నాయి పరిస్థితులు అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు