Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జ్వరామాబాద్‌గా మారిన నిజామాబాద్.. డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న డెంగ్యూ, చికెన్ గున్యా..

Nizamabad: డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. జ్వరాలతో వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తుకుండా జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ తెలిపారు..జిల్లాలో డెంగ్వూ జ్వరాల మరింత పెరగకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ఆసుపత్రులు ల్యాబ్ లు అడ్డగోలు టెస్టులపై వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెట్టాలని రోగులు కోరుతున్నారు.

Telangana: జ్వరామాబాద్‌గా మారిన నిజామాబాద్.. డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న డెంగ్యూ, చికెన్ గున్యా..
Prabhakar M
| Edited By: Jyothi Gadda|

Updated on: Sep 12, 2023 | 8:02 PM

Share

నిజామాబాద్, సెప్టెంబర్12: నిజామాబాద్ జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్ మోగిస్తుంటే.. మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు జిల్లా వాసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.విష జ్వరాలతో జనం ఆసుపత్రులకు క్యూడుతుంటే.. డెంగ్యూ పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడికి తెరలేపాయి…నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు.. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ఇంటికొకరు జ్వర పీడితులు ఉంటున్నారు. ఫలితంగా నిజామాబాద్ కాదు జ్వరామాబాద్ గా మారుతోంది. వైరల్ ఫీవర్స్ తో ఆసుపత్రులు రోగులతో కిక్కిరిస్తున్నాయి. డెంగ్యూ కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. జిల్లాలో క్రమంగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 156 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్న.. జిల్లాల్లో నిజామాబాద్ రెండో స్దానంలో ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. డెంగ్యూతో పాటు మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు సంఖ్య ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో వైరల్ ఫీవర్స్ తో వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఆసుపత్రికి వచ్చే వారిలో 30 మంది వైరల్ ఫీవర్స్ తో వస్తే.. ముగ్గురికి డెంగ్యూ నిర్ధారణ అవుతోందని వైద్యులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం జ్వరంతో వెళితే డెంగ్యూ పేరుతో దోపిడి చేస్తున్నారు. అవసరం లేకున్నా టెస్టులు చేస్తూ.. రోగుల జేబులకు చిల్లు పెడుతున్నారు. జ్వరంతో వచ్చే రోగిని అడ్మిట్ చేసుకుని ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎలిసా టెస్టులకు అనుమతి లేకున్నా.. టెస్టులు చేసి రిపోర్టులు ఇస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించే స్దోమత లేక కొందరు సర్కారు ఆసుపత్రికి క్యూకడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు రోగులకు అనవసర టెస్టులు చేయవద్దని ఐఎంఏ విజ్ఞప్తి చేస్తోంది.

అప్రమత్తంగా ఉండాలి ‍‍డాక్టర్ ప్రతిమారాజ్, సూపరింటెండెంట్ జిల్లా ఆసుపత్రి

నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ క్రమంగా పెరుగుతుండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ఫీవర్ వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్డులో 36 మంది జ్వర పీడితులు ఉండగా.. ముగ్గురు డెంగ్యూ పేషెంట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటు రోజురోజుకు వైరల్ ఫీవర్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైరల్ ఫీవర్స్ కు తోడు డెంగ్యూ జ్వరాలు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. కాలనీల్లో అపరిశుభ్ర వాతావరణంతో డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అందానికి కలిసిరాని అదృష్టం.. ఆఫర్స్ కోసం చిట్టి వెయిటింగ్..
అందానికి కలిసిరాని అదృష్టం.. ఆఫర్స్ కోసం చిట్టి వెయిటింగ్..
ఈ 5 హెయిర్ ప్యాక్స్‎తో చుండ్రు సమస్యకి ఫుల్ స్టాప్..
ఈ 5 హెయిర్ ప్యాక్స్‎తో చుండ్రు సమస్యకి ఫుల్ స్టాప్..
సామాన్యుల్లో ఒకరిగా అపర కుబేరుడు.. పబ్లిక్‌ ట్రామ్‌లో దుబాయ్‌రాజు
సామాన్యుల్లో ఒకరిగా అపర కుబేరుడు.. పబ్లిక్‌ ట్రామ్‌లో దుబాయ్‌రాజు
కళ్లులేని బిచ్చగాడికి ఇద్దరు పెళ్లాలు..రోజుకు 3వేలు సంపానా, అయినా
కళ్లులేని బిచ్చగాడికి ఇద్దరు పెళ్లాలు..రోజుకు 3వేలు సంపానా, అయినా
Tsunami Alert: ఆ ముప్పై దేశాలపై సునామి ఎఫెక్ట్‌...
Tsunami Alert: ఆ ముప్పై దేశాలపై సునామి ఎఫెక్ట్‌...
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
డ్రైవింగ్‌ లైసెన్స్‌లో ముందు లెర్నింగ్‌ ఎందుకు ఇస్తారో తెలుసా?
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
అతడికి 19, ఆమెకు 38..వింత లవ్ స్టోరీ వీడియో
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
బిస్కెట్లు కూడా తింటున్నారా? ఈ అలవాటును త్వరగా మానేయండి
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో
నడిరోడ్డులో గుర్రాల ఘర్షణ.. ఆ తర్వాత ఏమైందంటే వీడియో