Andhra pradesh: అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు శుభవార్త.. ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

Andhra pradesh: ప్రయాణికుల సౌకర్యార్థం వారి ఖర్చును దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ప్రతినెల అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతుంది. దీంతో భక్తుల కోరిక తీర్చడంతో పాటు ఆర్టీసీకి కొంత ఆదాయాన్ని కూడా సమకూర్చేలా చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు . దీంతో భక్తులు తక్కువ ఖర్చుతో తిరువన్నామలై లోని అరుణాచలేశ్వర స్వామిని దర్శించు కోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

Andhra pradesh: అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు శుభవార్త.. ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
Arunachal Kshetra
Follow us
Sudhir Chappidi

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 12, 2023 | 5:58 PM

కడప, సెప్టెంబర్12:  తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రాముఖ్యమో.. ఆ తరువాత తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర స్వామిని కూడా అంతే ప్రాముఖ్యతతో కొలుస్తారు. తిరువన్నామలై వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీ నుంచి వెళ్లే భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ కడప నుంచి ఈనెల 28న ప్రత్యేక బస్సు సర్వీస్ లను నడపనుంది.

తమిళనాడులోని తిరువన్నమలై ప్రాంతంలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి దేవాలయం భక్తుల కొంగు బంగారం గా కోరిన కోర్కెలను తీర్చే స్వామిగా అందరూ నమ్ముతారు. ముఖ్యంగా ఇక్కడ గిరి ప్రదక్షణ చేస్తే అంతా శుభం కలుగుతుందని చాలామంది నమ్మకం. అందుకే ఒక్కొక్క భక్తుడు నెలకు ఒకసారైనా తిరుమన్నామలై వెళ్లి వస్తుంటారు.

తిరుపతికి ఏ విధంగా వెళ్లి వస్తారో తిరువన్నామలైకి కూడా అదే విధంగా భక్తులు రద్దీగానే వెళుతుంటారు. ముఖ్యంగా కడప జిల్లా నుంచి అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వెళుతుండడంతో ప్రతి నెల ఒకరోజు తిరువన్నామలైకి ప్రత్యేక బస్ సర్వీసులను ఆర్టీసీ నడుపుతుంది. అందులో భాగంగా ఈనెల 28వ తేదీన కడప మైదుకూరు బద్వేల్ డిపోల నుంచి రెండు బస్సులను, ప్రొద్దుటూరు జమ్మలమడుగు పులివెందుల డిపోల నుంచి ఒక్కో బస్ సర్వీసును ప్రత్యేకంగా నడపనున్నారు. తక్కువ చార్జీతో కుటుంబ సమేతంగా వెళ్లే దానికి అనువుగా ఈ సర్వీస్ లను ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ కడప జిల్లా అధికారి గోపాల్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

కడప పరిసర ప్రాంతాల నుంచి తిరువన్నామలై లోని అరుణాచలేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి రావడానికి అప్ అండ్ డౌన్ దాదాపు 600 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇంత దూరం కుటుంబ సమేతంగా కారులో ప్రయాణించి రావాలంటే అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది. అందుకే ప్రయాణికుల సౌకర్యార్థం వారి ఖర్చును దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ప్రతినెల అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతుంది. దీంతో భక్తుల కోరిక తీర్చడంతో పాటు ఆర్టీసీకి కొంత ఆదాయాన్ని కూడా సమకూర్చేలా చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు . దీనివల్ల భక్తులు తక్కువ ఖర్చుతో తిరువన్నామలై లోని అరుణాచలేశ్వర స్వామిని దర్శించు కోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈనెల 28న అరుణాచలేశ్వర స్వామి దర్శించుకోవాలనుకుంటున్న భక్తులు ప్రత్యేక బస్సుల ద్వారా వెళ్లి రావచ్చని, ఈ సౌకర్యాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..