Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి మండపంలో వరుడు చేసిన కక్కుర్తి పని.. ఎడమచేత్తో ఈడ్చికొట్టిన వుధువు.. వీడియో చూస్తే అవాక్కే..!

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫన్నీ, ఆశ్చర్యం, విషాదం ఇలా రకరకాల ఎమోషన్స్‌తో కూడిన సన్నివేశాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఓ పెళ్లి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో కళ్యాణ మండపానికి సంబంధించినది. పెళ్లికూతురు వివాహ వేదికపైనే వరుడికి తగిన గుణపాఠం నేర్పించింది.

పెళ్లి మండపంలో వరుడు చేసిన కక్కుర్తి పని.. ఎడమచేత్తో ఈడ్చికొట్టిన వుధువు.. వీడియో చూస్తే అవాక్కే..!
Angry Bride Slaps Groom
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 12, 2023 | 3:22 PM

సోషల్‌ మీడియా అంటేనే వినోదాల విందు.. ఇక్కడ ఎన్నో రకాల వైరల్‌ వీడియోలు కనిపిస్తాయి. జంతువులు, పాములు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలను ఇక్కడ చూస్తుంటాం..అలాగే పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ఇలాంటి వీడియోల్లో కొన్ని ఆనందాన్నిస్తుంటే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని వీడియోలు వినోదాన్నిస్తే.. కొన్ని వీడియోలు విషాధంగా కూడా ఉంటాయి. ఇకపోతే, సోషల్ మీడియా వేదికగా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం వైరల్‌ అవుతుంటాయి. ఇటీవల ఓ వివాహ విందు కార్యక్రమంలో జరిగిన గొడవ వీడియో వైరల్‌గా మారింది. అయితే అలాంటి పెళ్లి వేడుకకు సంబంధించి మరో వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫన్నీ, ఆశ్చర్యం, విషాదం ఇలా రకరకాల ఎమోషన్స్‌తో కూడిన సన్నివేశాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఓ పెళ్లి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో కళ్యాణ మండపానికి సంబంధించినది. పెళ్లికూతురు వరుడికి తగిన గుణపాఠం నేర్పించింది. వైరల్‌ అవుతున్న వీడియోలో వరుడు గుట్కా తింటూ పెళ్లి మండపానికి రావటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ కారణంగా వధువు కోపంగా, అందరి ముందు వరుడి చెంప చెల్లుమనిపించింది. పెళ్లి మండపంలో కూర్చున్న వధూవరులకు ఎదురుగా ఉన్న వ్యక్తి పెళ్లి కూతురికి ఏదో చెబుతున్నాడు.. దాంతో చిరాకుపడ్డ ఆమె.. అతని ముఖంపై ఒక్కటిస్తుంది. ఆ తర్వాత వరుడివైపుకు తిరిగింది.. అతడు గుట్కా తింటున్నాడని తెలిసి ఎడమ చేత్తో ఈడ్చి కొట్టింది. దాంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు. అందరి ముందే ఆమె ఆ ఇద్దరి చెంపలు చెల్లుమనిపించిన ఈ ఘటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వధూవరుల ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక_నిరంజన్మ్87 షేర్ చేశారు. మరికొందరు వరుడిని అజయ్ దేవగన్ అభిమాని అంటుంటే, మరికొందరు వధువు చేసిన పనికి వరుడిని మందలిస్తున్నారు. ఇకపోతే, “గుట్కా ఆరోగ్యానికి హానికరం..అది మన శరీరానికి హాని చేస్తుంది” అని మనందరికీ తెలుసు. గుట్కా తినవద్దని ప్రభుత్వాలు కూడా ప్రజలకు సూచిస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..