Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీజేపీ లో పోటీ కి వేల కొద్ది దరఖాస్తులు.. ఎవరెవరు ఎక్కడి నుండి క్యూ కడుతున్నారంటే..

ఇప్పటికే దరఖాస్తులు తీసుకోవడం పూర్తి కావడంతో వాటి పరిశీలన కూడా మరో కమిటి వేయనున్నారు.. వీరు ఒక్కో నియోజకవర్గం నుండి ఇద్దరి పేర్లను హైకమండ్ కి పంపనున్నారు..వీటితో ఎన్నికల కమిటి కూడా పూర్తి చేసి అభ్యర్థులను కదనరంగం లోకి దింపాలని చూస్తుండడంతో వచ్చే అభ్యర్థులు మరి అధికార పార్టీ ని ఎలా ఎదుర్కుంటారో చూడాలి మరి..

Telangana: బీజేపీ లో పోటీ కి వేల కొద్ది దరఖాస్తులు.. ఎవరెవరు ఎక్కడి నుండి క్యూ కడుతున్నారంటే..
Telangana BJP
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 11, 2023 | 10:41 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలకు అటు క్యాడర్ కి మంచి బుస్టింగ్ వచ్చింది.. ఇక రాష్ట్రంలో బీజేపీ పనైపోయిందన్న వారి నోటికి తమ పార్టీ కి వచ్చిన దరఖాస్తులను చూపించితాళంవేపించాబోతున్నారు అనుకున్న దానికి మించి రెట్టింపు సంఖ్యలో టికెట్ ఆశావహుళ నుండి స్పందన వచ్చింది.. కేవలం వారం రోజుల వ్యవదిలో 6011 దరఖాస్తులు వచ్చాయి.. ఒక్కో నియోజకవర్గం నుండి ఎవరెవరు చేశారు ఆ నియోజకవర్గం ఎన్ని అప్లికేషన్ లు వచ్చాయో ఇంకా పూర్తి స్థాయి రిపోర్ట్ రావాల్సి ఉంది.. బీజేపీ గ్రాఫ్ తగ్గిందన్న వారికీ భారీగా వచ్చిన దరఖాస్తులె నిదర్శనం అని ఇప్పటి వరకు విమర్శిస్తున్న నోళ్లకు తాళాలు వేస్తున్నారు.. మరోవైపు ఎలాంటి రుసుము లేకపోవడం వల్లే దరఖాస్తులు వచ్చాయని.. అప్లికేషన్ లు పెట్టుకున్న వారిలో ఎంతమంది కి టికెట్లు ఇస్తారో సందేహాస్పదంగా మారింది..

అందరు కచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని హై కమాండ్ చెప్పిన ముఖ్య నాయకులు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు.. దింతో అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.. దరఖాస్తు చేసుకొని ముఖ్య నేతల్లో పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి,ఎంపీలు లక్ష్మణ్ బండి సంజయ్, అరవింద్, సోయం బాపూరావ్, డీకే అరుణ, విజయ్ శాంతి, బూర నర్సయ్య గౌడ్,చింతల రామచంద్ర రెడ్డి, రామచంద్ర రావు, Nvss ప్రభాకర్, జయసుధ, ఇంద్ర సేనా రెడ్డి, వివేక్ వెంకట్ స్వామి లాంటి ముఖ్య నేతలు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు.. కేసీఆర్ పై పోటీ చేస్తా అని చెప్పిన ఈటెల కూడా దరఖాస్తు చేయలేదు కానీ ఈటెల తరుపున గజ్వేల్ నుండి ఆయన అభిమానులు మాత్రం దరఖాస్తు చేశారు..

ఇక బీజేపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న ముఖ్య నాయకుల వివరాలు చూస్తే..

ఇవి కూడా చదవండి

రఘునందన్ రావు దుబ్బాక ,

జితేందర్రెడ్డి -మహబూబ్ నగర్…

బండారువిజయలక్ష్మి-ముషీరాబద్

సామ రంగారెడ్డి -ఎల్బి నగర్

వికాస్ రావు -వేములవాడ

తుల ఉమా -వేములవాడ

రాకేష్ రెడ్డి -వరంగల్ పశ్చిమం

విక్రమ్ గౌడ్ -గోషామహల్

NV సుభాష్ -ఖైరతాబాద్

మిధున్ -షాద్ నగర్

అందేల శ్రీరాం -మహేశ్వరం

బండ కార్తీక -సికింద్రాబాద్

బాబు మెహన్ -అందోల్

జీవిత రాజశేఖర్ -సనత్ నగర్ /కూకట్పల్లి /జూబ్లీహిల్స్ /సికింద్రాబాద్

బోగా శ్రావణి -జగిత్యాల

బండ కార్తీక -సికింద్రాబాద్ నుండి దరఖాస్తు చేస్తుకున్నారు..ప్రతి నియోజకవర్గం నుండి 4నుండి 5 దరఖాస్తులు వరకు వచ్చినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి..

అయితే ముఖ్య నాయకులు దరఖాస్తు చేసుకోకపోవడంపై బిజెపి కార్యాలయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి పార్లమెంటుకి పోటీ చేయాలని ఉద్దేశంతో కొందరు అప్లికేషన్ పెట్టుకోలేదని మరికొందరు జిల్లా మీటింగ్లలోనే మేము పోటీ చేస్తున్నామని ప్రకటించడంతో ఇంకా దరఖాస్తు చేసుకోలేదని ఇంకొందరైతే ఇంద్రసేనారెడ్డికి తమ అప్లికేషన్లు డైరెక్ట్ గా ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి హాయ్ కమాండ్ ఆర్డర్ వేసిన తర్వాత కూడా దరఖాస్తు పెట్టుకోకపోవడంపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీన్ని కేంద్ర నాయకత్వం ఎలా చేస్తుందో చూడాలి

మరోవైపు అధికార బిఆరెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో బీజేపీ సైతం ఈ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారం లో అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తుంది.. ఇప్పటికే దరఖాస్తులు తీసుకోవడం పూర్తి కావడంతో వాటి పరిశీలన కూడా మరో కమిటి వేయనున్నారు.. వీరు ఒక్కో నియోజకవర్గం నుండి ఇద్దరి పేర్లను హైకమండ్ కి పంపనున్నారు..వీటితో ఎన్నికల కమిటి కూడా పూర్తి చేసి అభ్యర్థులను కదనరంగం లోకి దింపాలని చూస్తుండడంతో వచ్చే అభ్యర్థులు మరి అధికార పార్టీ ని ఎలా ఎదుర్కుంటారో చూడాలి మరి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..