TS DOST Degree Admission: సెప్టెంబర్‌ 15వ తేదీ లోపు డిగ్రీ కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌.. అదనంగా 15,490 మందికి సీట్లు

ష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో దోస్త్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో అదనంగా 15,490 మంది విద్యార్ధులు డిగ్రీలో సీట్లు పొందారు. ఈ మేరకు గత శనివారం (సెప్టెంబర్‌ 9) సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన..

TS DOST Degree Admission: సెప్టెంబర్‌ 15వ తేదీ లోపు డిగ్రీ కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌.. అదనంగా 15,490 మందికి సీట్లు
DOST degree admission
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 12, 2023 | 8:34 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో దోస్త్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో అదనంగా 15,490 మంది విద్యార్ధులు డిగ్రీలో సీట్లు పొందారు. ఈ మేరకు గత శనివారం (సెప్టెంబర్‌ 9) సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్ధులు సెప్టెంబర్‌ 10 నుంచి 15వ తేదీ లోపు సంబంధిత కాలేజీలో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఓ ప్రకటనలో తెలిపారు. మరో వైపు ఇంటర్‌ ప్రవేశాలు ముగిశాయి. మిగిలిన కోర్సుల ప్రవేశాలు కూడా త్వరలోనే ముగింపుకు రానున్నాయి.

వైద్య కాలేజీల్లో ‘స్థానిక రిజర్వేషన్‌’పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇదే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్‌ అంశంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్‌ కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద వచ్చే సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం మెడికల్‌ సీట్లలో ఆలిండియా కోటా కింద 15 శాతం ఇవ్వవలసి ఉంటుంది. ఇవి పోగా మిగిలిన సీట్లన్నీ తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్ధులకే దక్కాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు తెలియజేస్తూ జీవో 72ను ఇచ్చింది. ఈ జీవోను సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు విద్యార్థులు హైకోర్టులో తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లను విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ ఉచ్చిన ఉత్తర్వులను తీర్పు సందర్భంగా న్యాయస్థానం సమర్ధించింది. ఆల్‌ ఇండియా కోటాకు పోగా మిగిలిన సీట్లన్నీ రాష్ట్ర విద్యార్ధులకే కేటాయించాలని తీర్పును వెల్లడించింది. ఏపీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌లను కోర్టు కొట్టివేసింది.

తెలంగాణ టీచర్‌ కొలువుల భర్తీకి రోస్టర్‌ ఇలా..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 5,089 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సెప్టెంబర్‌ 20వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల (అక్టోబర్) 21 వరకు దరఖాస్తు విధానం కొనసాగుతుంది. అనంతరం నవంబర్ 20 నుంచి 30 వరకు దాదాపు 11 రోజులపాటు తెలంగాణ డీఎస్సీ-2023 పరీక్షలు జరుగుతాయి. ఇది డీఎస్సీ నియామక ప్రక్రియ. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో టీచర్‌ పోస్టుల నియామకాలకు కొత్తగా రోస్టర్‌ను అమలు చేయనుంది ప్రభుత్వం. గతంలో ఉన్న రోస్టర్‌ పాయింట్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ప్రతి 100 పోస్టులను ఒక సైకిల్‌గా పరిగణిస్తారు. కొత్త రోస్టర్ సైకిల్‌లో ఎస్టీ రిజర్వేషన్‌ 6 నుంచి 10కి పెంచడం, ఈడబ్ల్యూఎస్‌ కోటా శాతం 10 కి పెంచడం వంటి తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ ఈ విధానం అమలు చేయబోతున్నట్లు విద్యాశాఖ అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.