Hyderabad: ర్యాగింగ్‌పై గాంధీ మెడికల్ కాలేజీ జులుం.. పది మంది ఎంబీబీఎస్‌ విద్యార్ధులపై సస్పెన్షన్ వేటు!

తెలంగాణ రాష్ట్రంలో ర్యాగింగ్‌ బూతానికి ఇప్పటికే పలువురు మెడికల్‌ స్టూడెంట్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొన్ని వైద్యా కాలేజీల్లో ర్యాంగింగ్‌ సంస్కృతి ఇప్పటికీ నివురు గప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉంది. తాజాగా నగరంలోని ఓ మెడికల్‌ కాలేజీలో జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్..

Hyderabad: ర్యాగింగ్‌పై గాంధీ మెడికల్ కాలేజీ జులుం.. పది మంది ఎంబీబీఎస్‌ విద్యార్ధులపై సస్పెన్షన్ వేటు!
Gandhi Medical College Mbbs Students Suspended
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 12, 2023 | 1:10 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్ 12: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాగింగ్‌ బూతానికి ఇప్పటికే పలువురు మెడికల్‌ స్టూడెంట్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొన్ని వైద్యా కాలేజీల్లో ర్యాంగింగ్‌ సంస్కృతి ఇప్పటికీ నివురు గప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉంది. తాజాగా నగరంలోని ఓ మెడికల్‌ కాలేజీలో జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసినందుకు గాను పది మంది ఎంబీబీఎస్ విద్యార్థులను ఆ మెడికల్ కాలేజీ అధికారులు సోమవారం (సెప్టెంబర్ 11) సస్పెండ్ చేశారు. వివరాల్లోకెళ్తే..

హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీకి ఎంతో ప్రతిష్ట ఉంది. అక్కడ చదువుకున్న ఎందరో విద్యార్ధులు వైద్యులుగా దేశ వ్యాప్తంగా పలు చోట్ల విధులు నిర్వహిస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ వ్యవస్ధ ఉండటం సిగ్గుచేటు. అక్కడ జూనియర్‌ విద్యార్ధులను సీనియర్లు ర్యాగింగ్‌ చేయడం పరిపాటై పోయింది. తాజాగా మరోమారు గాంధీ మెడికల్‌ కాలేజీలో ర్యాంగింగ్‌ కలకలం సృస్టించింది. ఈ నేపథ్‌యంలో ర్యాగింగ్‌ నిరోధక కమిటీ విచారణలో సీనియర్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో పది మంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) డిఆర్ కె రమేష్ రెడ్డి మీడియాకు తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తన నిర్ణయం గురించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు తెలియజేసింది.

తమపై ర్యాంగింగ్‌కు పాల్పడినట్లు 2023 బ్యాచ్‌కు చెందిన జూనియర్ విద్యార్ధులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో 2021 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఎంబీబీఎస్‌ విద్యార్ధులు, 2022 బ్యాచ్‌కి చెందిన మరో ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ ద్వారా తమను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు ర్యాగింగ్‌కు గురైన విద్యార్థులు తెలిపారు. ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగినప్పటికీ సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే సహించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెడికల్‌ కాలేజీ డీఎంఈ రమేష్‌రెడ్డి హెచ్చరించారు. ర్యాగింగ్ నిరోధక చట్టాల ప్రకారం ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీలకు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.