Hyderabad: నగరంలో వరుసగా ప్రత్యక్షమవుతోన్న కొండచిలువలు.. భయాందోళనలో భాగ్యనగర వాసులు..
Hyderabad: అడవి లో ఉండాలిసిన వన్యప్రాణులు నగరబాట పడుతున్నాయి. ఇళ్లలోకి, వరద నీళ్లలోకి దర్శనం ఇచ్చి భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాను వన్యప్రాణులు రోడ్ల మీద కనిపిస్తున్నాయి. చల్లదానం కోసం బయటకు వస్తున్న వన్యప్రాణులను చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురి అవుతున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 12: నగరంలో కురిసిన వర్షాలకు గాను కొన్ని ప్రదేశాలలో వరద నీటిలోనే పాములు దర్శనం ఇచ్చాయి. ఆ సమస్య తీరిందనుకునే లోపే ఇప్పుడు ఏకంగా ఇళ్ల పరిసరా ప్రాంతాలలో కొండచిలువు కనిపిస్తూ ఉండటంతో హైదరాబాద్ వాసులో భయాందోళనకు గురవుతున్నారు. అడవిలో ఉండాలిసిన ప్రాణులు ఇలా బయటకు వస్తుండడం ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలే కారణమని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం మూసినదిలో భారీ కొండచిలువ ప్రత్యేక్షం అయింది. కొండచిలువను చూసిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మరో భారీ కొండచిలువ రాజేంద్ర నగర్‌లోని హసన్ నగర్‌లో కలకలం రేపింది.. లారీ పార్కింగ్ చేసిన ప్రాంతం నుంచి శబ్దం రావడంతో లారీ డ్రైవర్లు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాలు అంతా వెతికారు. ఒక్కసారిగా భారీ కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. 20 ఫీట్ల పొడవున్న భారీ కొండచిలువ అడుగులను వదిలి జనావాసాల మధ్యకు రావడంతో కంగు తిన్నారు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత కొండచిలువను పట్టుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో అక్కడ శబ్దం రాకపోయి ఉంటే తమ పరిస్థితి ఏంటో అని భయబ్రాంతులకు గురయ్యారు లారీ డ్రైవర్లు. వివిధ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా లారీ డ్రైవర్లు పార్కింగ్ చేసుకుని ఉంటారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా చెత్తాచెదారం ఉన్న అటవీ ప్రాంతం ఉందా అని అనుమానిస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు నేపథ్యంలో ఈ విధంగా వన్యప్రాణులు బయటికి వస్తున్నాయని కూడా భావిస్తున్నారు.
మరోవైపు నిజాంపేట్‌లో కూడా భారీ కొండచిలువను పట్టుకున్నారు. పురాణ పూల్‌లో కూడా నీటిలో ప్రవహిస్తున్న భారీ కొండచిలువను చూసి అక్కడ స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ విధంగా అడవిలో ఉండాల్సిన భారీ కొండచిలువలు జనావాసాల మధ్యకు రావడంతో భయభ్రాంతులకు అవుతున్నారు. అయితే చల్లదనం కోసం ఈ విధంగా బయటికి వస్తున్నాయని స్నేక్ స్నాచారులు చెప్తున్నారు. ఆ విధంగా ఎక్కడైనా వన్యప్రాణులు కనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. వరుసగా నగరంలో ప్రత్యక్షమైనటువంటి కొండచిలువలను చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు నగరవాసులు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..