Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలే.. వానలు.. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం..

సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులకు సూచించింది విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం. మరోవైపు.. తెలంగాణలోనూ వర్షాలు ఏమాత్రం గ్యాప్‌ ఇవ్వడం లేదు. ఇప్పటికే.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలే.. వానలు.. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం..
Rains
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 12, 2023 | 7:33 AM

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలే.. వానలు. ఏపీ, తెలంగాణను వర్షాలు ఏమాత్రం వీడటం లేదు. బంగాళాఖాతంలో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంతో మరో నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. దాని ప్రభావంతో మరికొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా.. ఈనెల 15 వరకు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రధానంగా.. ఏపీలోని గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ జారీ చేసింది విశాఖ వాతావరణ శాఖ. పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. ఇక.. సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులకు సూచించింది విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం. మరోవైపు.. తెలంగాణలోనూ వర్షాలు ఏమాత్రం గ్యాప్‌ ఇవ్వడం లేదు. ఇప్పటికే.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మరో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, వికారాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే.. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే.. ఇప్పటికే.. హైదరాబాద్‌లో మధ్యమధ్యన కాస్త గ్యాప్‌ ఇస్తూ వరుణుడు దంచికొడుతున్నాడు. మూడు, నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షంతో రోడ్లు జలమయమై.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా.. తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పేలా కనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్