Hyderabad: సొంతింట్లోనే చోరీ చేసిన మహిళ.. చివరికి ఇలా అడ్డంగా బుక్కైంది.. అసలేం జరిగిందంటే..!

Hyderabad News: సొంత ఇంట్లోనే దొంగతనం చేసిన మహిళను మరో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసిన మీర్​చౌక్ పోలీసులు. నిందితుల నుంచి 56 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌జోన్‌ డీసీపీ సాయి చైతన్య కేసు వివరాలను వెల్లడించారు. ఉస్మాన్​పురాకు చెందిన జహూర్​హుస్సేన్, ఫరీదా బేగంలు భార్యాభర్తలు. కొన్ని రోజుల క్రితం తన వద్ద ఉన్న డబ్బుతో ఆన్​లైన్‌లో పేపర్​కట్టింగ్, ప్రింటింగ్​మిషన్లకు...

Hyderabad: సొంతింట్లోనే చోరీ చేసిన మహిళ.. చివరికి ఇలా అడ్డంగా బుక్కైంది.. అసలేం జరిగిందంటే..!
Woman Arrest
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Shiva Prajapati

Updated on: Sep 12, 2023 | 5:31 AM

Hyderabad News: సొంత ఇంట్లోనే దొంగతనం చేసిన మహిళను, మరో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసిన మీర్​చౌక్ పోలీసులు. నిందితుల నుంచి 56 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌత్‌జోన్‌ డీసీపీ సాయి చైతన్య కేసు వివరాలను వెల్లడించారు. ఉస్మాన్​పురాకు చెందిన జహూర్​హుస్సేన్, ఫరీదా బేగంలు భార్యాభర్తలు. కొన్ని రోజుల క్రితం తన వద్ద ఉన్న డబ్బుతో ఆన్​లైన్‌లో పేపర్​కట్టింగ్, ప్రింటింగ్​మిషన్లకు ఫరీదా బేగం ఆర్డర్​ చేసింది. డబ్బు చెల్లించినా మిషిన్ల రాలేదు. మరికొంత డబ్బు పంపించాలని సప్లయర్‌ అడిగాడు. మరింత డబ్బు చెల్లించిన తర్వాత నెల క్రితం మిషిన్లను పంపించాడు.

మిషన్ల ద్వారా ఎలాంటి ఉత్పత్తి చేయకపోవడంతో ఫరీదా బేగంపై భర్త హుస్సేన్​ అసహనం వ్యక్తం చేశాడు. త్వరలోనే వ్యాపారం ప్రారంభమవుతందని భర్తతో ఫరీదా బేగం చెప్పింది. కానీ సప్లయర్​ ముడి పదార్థాలను పంపించట్లేదని తన భర్తకు చెప్పలేదు. అంతేకాకుండా భర్తకు తెలియకుండా ఫరీదాబేగం నగలు అమ్మి రూ. 84 వేలు, కొన్ని నగలు తాకట్టు పెట్టి రూ.42 వేలను ముడి పదార్థాల కోసం సప్లయర్‌కు ఇచ్చింది. ఫరీదా బేగం ఇచ్చిన నగదును సప్లయర్‌ స్వాహా చేసి ముడి పదార్థలను పంపలేదు. సప్లయర్‌ మోసం చేశాడన్న విషయం తెలిస్తే భర్త కోపగిస్తాడని ఫరీదా బేగం భయపడింది.

ఆన్​లైన్​ యాప్‌లోనూ ఫరీదా బేగం అప్పు చేసింది. అప్పు చేసిన డబ్బుల్లో నుంచి రూ.35 వేలను ఇంటి మరమ్మతులు కోసం ఖర్చు చేసింది. ఆన్‌లైన్‌ యాప్‌లో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో యాప్ ​నిర్వాహకులు ఒత్తిడి చేశారు. ఏం చేయాలో తెలియక సొంత ఇంట్లోనే దొంగతనం చేయాలని ఫరీదా బేగం ప్లాన్‌ వేసింది. పథకం ప్రకారం తన అత్తకు చెందిన 56 తులాల బంగారు నగలను దొంగతనం చేసింది. దొంగతనం చేసిన నగలను తన సోదరి ఫర్హీన్ ​బేగం, ఆమె భర్త మహ్మద్​ సమీర్‌తో కలిసి విక్రయించాలనుకుంది.

ఇంట్లో నగలు కనిపించక పోవటంతో మీర్​చౌక్​ పోలీసులకు ఫరీదా బేగం భర్త హుస్సేన్​ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఫరీదా బేగమే దొంగతనానికి పాల్పడిందని నిర్ధారించారు. ఫరీదాబేగంతో పాటు మహ్మద్​ సమీర్, ఫర్హీన్ ​బేగంను కూడా అదుపులోకి తీసుకున్నారు. 56 తులాల బంగారు నగలను రికవరీ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..