Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: పాక్‌ని చిత్తుచిత్తు చేసిన భారత్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెప్పించిన టీమిండియా.. నెటిజన్ల స్పందన ఇదే..

IND vs PAK: టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ అర్థసెంచరీలతో.. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అజేయమైన సెంచరీలతో రఫ్ఫాడించారు. ఇలా భారత్ ఇచ్చిన 357 పరుగుల టార్గెట్‌ని చేధించేందుకు వచ్చిన పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. జస్ప్రీత్ బూమ్రా, మహ్హద్ సిరాజ్ ప్రారంభం నుంచే కట్టడి చేయడం.. మిడిల్ ఓవర్లు వేయడానికి వచ్చిన కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో పాక్ బ్యాటర్లను స్పిన్ సుడిగుండంతో బయటకు నెట్టేయడంతో..

IND vs PAK: పాక్‌ని చిత్తుచిత్తు చేసిన భారత్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెప్పించిన టీమిండియా.. నెటిజన్ల స్పందన ఇదే..
IND vs PAK
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 12, 2023 | 7:43 AM

IND vs PAK: ఆసియా కప్‌లో సూపర్-4లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను భారత జట్టు చిత్తు చిత్తు చేసింది. అర్థసెంచరీలు, సెంచరీలు, 5 వికెట్ హాల్‌తో పాక్ బౌలర్లు, బ్యాటర్లుకు రోహిత్ సేన చుక్కలు చూపించింది. జట్టులో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ ఉన్నా.. కింగ్ కోహ్లీ విజృంభిస్తే వెనకడుగు వేయాల్సిందేనని ఈ మ్యాచ్ నిరూపించింది. పాక్‌పై 228 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్లు రోహిత్ శర్మ (56), శుభమాన్ గిల్ (58) అర్థసెంచరీలతో.. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (122, నాటౌట్), కేఎల్ రాహుల్ (111, నాటౌట్) అజేయమైన సెంచరీలతో రఫ్ఫాడించారు. ఇలా భారత్ ఇచ్చిన 357 పరుగుల టార్గెట్‌ని చేధించేందుకు వచ్చిన పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. జస్ప్రీత్ బూమ్రా, మహ్మద్ సిరాజ్ ప్రారంభం నుంచే కట్టడి చేయడం.. మిడిల్ ఓవర్లు వేయడానికి వచ్చిన కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో పాక్ బ్యాటర్లను స్పిన్ సుడిగుండంతో బయటకు నెట్టేయడంతో విజయం భారత్ సొంతమైంది.

అయితే సెప్టెంబర్ 2న జరిగిన భారత్ vs పాక్ మ్యాచ్ సగం అయ్యాక వర్షం కారణంగా రద్దు కావడంతో అభిమానులు నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌(82) వికెట్ తీసిన హరీస్ రవుఫ్ ‘నికాల్ నికాల్’ అంటూ రెచ్చిపోవడం, పాక్ జట్టు బౌలర్లను చూసుకొని మిడిసిపడడంతో ప్రత్యర్ధికి తర్వాతి మ్యాచ్‌లో బుద్ధి చెప్పాలంటే కింగ్ కోహ్లీ మళ్లీ రంగంలోకి దిగాలని అభిమానులు కోరుకున్నారు. అనుకున్నదే అయింది. అయితే ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ మాత్రమే కాక టాప్ ఆర్డర్ బ్యాటర్లు అంతా పాక్‌పై దాడి చేశారు. పాక్ బౌలర్లు షాహీన్ అఫ్రిదీ, నసీమ్ షా, ఫహీమ్ అశ్రఫ్, హరీస్ రవుఫ్, షబాద్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ వేసిన ఓవర్లలో పరుగుల వర్షం కురిపించారు. భారత బ్యాటర్ల ముందు పాక్ బైలర్లు, భారత్ బౌలర్ల ముందు పాక్ బ్యాటర్లు నిలవలేకపోవడం.. రోహిత్ సేన విజయం సాధించడంతో ప్రపంచ  క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా సోషల్ మీడియా వేదికగా రకరకాల టీమ్స్‌తో సందడి చేస్తున్నారు. వాటిపై ఓ లుక్ వేద్దాం..

ఇవి కూడా చదవండి

మూడు పూటలకు ఇచ్చేశాడు..

కోహ్లీ ఇజ్ ది కింగ్..

పార్టీ టైమ్..

అభిమానులు సందడి..

హార్దిక్.. ది యూనిక్ ప్లేయర్

కింగ్ ఒక్కడే..

ప్రేమదాస మైదానంలో కోహ్లీకి వరుసగా నాలుగో సెంచరీ..

తెలిసిందా ఇప్పటికైనా..

విజృంభిస్తే నిలవలేవురా.. 

కింగ్ ఇక్కడ..

సరిపోయింది..

77వ సెంచరీ..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..