- Telugu News Photo Gallery Cricket photos India vs Pakistan: Team Indian Sets New Records in The Asia Cup 2023 Match Against Pakistan
India vs Pakistan: పాక్‌పై భారత్ తిరుగులేని విక్టరీ.. ఈ మ్యాచ్‌లో టీమిండియా నెలకొల్పిన సరికొత్త రికార్డ్స్ ఇవే..
ఆసియా కప్‌లో సూపర్-4లో కొలంబో వేదికగా జరిగిన భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 228 పరుగుల భారీ తేడాతో ఈ విజయాన్ని నమోదు చేసింది భారత్. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన టీమిండియా బ్యాట్స్‌మెన్స్.. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్, బౌలర్లు నమోదు చేసిన రికార్డ్స్ ఏంటో ఓసారి పరిశీలిద్దాం..
Updated on: Sep 12, 2023 | 7:08 AM

ఆసియా కప్‌లో సూపర్-4లో కొలంబో వేదికగా జరిగిన భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 228 పరుగుల భారీ తేడాతో ఈ విజయాన్ని నమోదు చేసింది భారత్.

మ్యా్చ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన టీమిండియా బ్యాట్స్‌మెన్స్.. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్, బౌలర్లు నమోదు చేసిన రికార్డ్స్ ఏంటో ఓసారి పరిశీలిద్దాం..

పరుగుల పరంగా ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కు ఇది అతిపెద్ద విజయం. 228 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్‌పై టీమిండియా గెలుపొందింది.

భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో వరుసగా 5 వికెట్లు తీసి సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్. 1996లో అనిల్ కుంబ్లే 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. ఇప్పుడు కుల్దీప్ యాదవ్ 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 2005లో సచిన్ టెండూల్కర్ 50 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 1988లో అర్షద్ ఆయూబ్ 21 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి.. ఇప్పటికీ టాప్‌లో ఉన్నారు. కుల్దీప్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.

ఇక వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెట్లర్ల లిస్ట్‌లోకి కోహ్లీ చేరాడు. ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ 1,3024 పరుగులు చేశాడు. అంతేకాదు.. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 1,3000 వేల మైలురాయి దాటిన క్రికెటర్‌గా కోహ్లీ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. కేవలం 267 ఇన్నింగ్స్‌లోనే విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.

వన్డేల్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో అత్యధిక భాగస్వామ్యం చేసి న్యూ రికార్డ్ క్రియేట్ చేశారు కోహ్లీ, కేఎల్ రాహుల్. కోహ్లీ-కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి 3 వికెట్ భాగస్వామ్యానికి 233 పరుగులు చేసి ఔరా అనిపించారు. వీరికంటే ముందు ఎన్ఎస్ సిద్ధూ-సచిన్ 231 పరుగులతో రికార్డ్ ఉండగా.. ఇప్పుడది సెకండ్ ప్లేస్‌రి మారిపోయింది.

కొలంబో ఆర్‌పీఎస్ క్రికెట్ స్టేడియం వేదికగా విరాట్ కోహ్లీ సాధించిన చివరి నాలుగు భారీ స్కోర్లు. 128*(119), 131(96), 110*(116), 122*(94) పరుగులు చేశాడు కోహ్లీ. వన్డే ఆసియా కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ లిస్ట్‌లో 4 సెంచరీలతో కోహ్లీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు.




