Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBN Arrest: చంద్రబాబు హౌజ్‌ రిమాండ్‌ పిటిషన్‌పై కోర్టు కీలక తీర్పు.. ఏమందంటే

జైలులో చంద్రబాబు కోసం ప్రత్యేకంగా ఒక బ్యారెక్‌ను కేటాయించినట్లు పొన్నవోలు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చంద్రబాబు భద్రత కోసం సీసీ కెమెరా, మెడికల్ ఎమర్జెన్సీ కూడా ఉన్నట్లు ఆయన వివరించారు. ఇక చంద్రబాబును శత్రుదుర్భేద్యంగా ఉంచినట్లు పొన్నవోలు తెలిపారు. ఈ కారణంగానే ఆయన హౌజ్‌ రిమాండ్ అవసరం లేదని ఆయన వాదించారు. మొత్తం మీద పొన్నవోలు వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు రిమాండ్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది...

CBN Arrest: చంద్రబాబు హౌజ్‌ రిమాండ్‌ పిటిషన్‌పై కోర్టు కీలక తీర్పు.. ఏమందంటే
Chandrababu Naidu
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 12, 2023 | 5:19 PM

చంద్రబాబును హౌజ్‌ రిమాండ్‌కు అనుమతించాలని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హౌజ్‌ రిమాండ్‌ పిటిషన్‌ను కొట్టేసింది. సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు కావాల్సినంత భద్రత ఉందని సీఐడీ అధికారులు తెలిపారు. సీఐడీ వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు తీర్పును వెలవరించింది. ఈ విషయమై అడిషనల్ అడ్వకేట్ జనరల్‌ పొన్నవోలు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఆర్పీసీ చట్టంలో కేవలం రెండే కస్డడీలు ఉంటాయన్నారు.

వీటిలో ఒకటి పోలీస్‌ కస్టడీ కాగా మరోటి జుడీషియల్ కస్టడీ అని తెలిపారు. జైలులో చంద్రబాబు కోసం ప్రత్యేకంగా ఒక బ్యారెక్‌ను కేటాయించినట్లు పొన్నవోలు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చంద్రబాబు భద్రత కోసం సీసీ కెమెరా, మెడికల్ ఎమర్జెన్సీ కూడా ఉన్నట్లు ఆయన వివరించారు. ఇక చంద్రబాబును శత్రుదుర్భేద్యంగా ఉంచినట్లు పొన్నవోలు తెలిపారు. ఈ కారణంగానే ఆయన హౌజ్‌ రిమాండ్ అవసరం లేదని ఆయన వాదించారు. మొత్తం మీద పొన్నవోలు వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు రిమాండ్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి

చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖాత్‌..

ఇదిలా ఉంటే మరో వైపు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ముగిసింది. చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేష్‌తో పాటు బ్రాహ్మణి మాట్లాడారు. చంద్రబాబుతో కుటుంబ సభ్యులతో 40 నిమిషాల పాటు చర్చించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసమే పోరాడారన్నారు. చంద్రబాబు జీవితమంతా ప్రజల కోసమే ధారపోశారన్న ఆమె, తమ కుటుంబానికి ఇది చాలా కష్టకాలమన్నారు. చంద్రబాబు నిర్మించిన జైల్లోనే ఆయన్ను కట్టిపాడేశారంటూ భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు భద్రతపై తనకు ఆందోళన ఉందన్న భువనేశ్వరి జైల్లో ఆయనకు సరైన సౌకర్యాలు లేవన్నారు. భువనేశ్వరి ఇంకా మాట్లాడుతూ.. ‘కుటుంబం కంటే చంద్రబాబుకు ప్రజలే ముఖ్యం. చంద్రబాబు కట్టిన జైల్లోనే ఆయన్ని కట్టిపడేశారు. లేనిపోని కేసులతో ఆయన్ని ఇబ్బందిపెడుతున్నారు. భద్రతాపరమైన అనుమానాలే ఉన్నాయి. జైల్లో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేవు’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబును కలవడానికి వెళ్తున్న కుటుంబ సభ్యులు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..