Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: ‘ఇంత కన్నా వెన్నుపోటు మరోటి ఉంటుందా’.? సంచలన దర్శకుడి ఇంట్రెస్టింట్ ట్వీట్‌

న్యాయపరంగా పరిణామాలు ఇలా వేగంగా చోటు చేసుకుంటుంటే.. మరోవైపు రాజకీయంగా ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. అటు అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీల మధ్యల మాటల యుద్ధం కొనసాగుతోంది. పవన్‌ కళ్యాణ్‌తో పాటు మరికొంత మంది చంద్రబాబుకు మద్ధతు నిలుస్తుండగా, వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు చేసిన అవినీతికి సరైన శిక్ష పడిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదంతా ఇలా ఉంటే.. సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందించే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సైతం...

RGV: 'ఇంత కన్నా వెన్నుపోటు మరోటి ఉంటుందా'.? సంచలన దర్శకుడి ఇంట్రెస్టింట్ ట్వీట్‌
RGV
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 12, 2023 | 4:46 PM

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఉందంటూ అరెస్ట్‌ చేయడం, రిమాండ్‌కు తరలించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. నంద్యాలలో అరెస్ట్ చేసి, విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచడం చట్ట విరుద్దం అంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో లంచ్ మోషన్‌ పిటిషన్‌ను అనుమంతించిన హైకోర్ట్ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై బుధవారం ఏపీ హైకోర్ట్‌ విచారించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించిన విషయం విధితమే.

ఇక న్యాయపరంగా పరిణామాలు ఇలా వేగంగా చోటు చేసుకుంటుంటే.. మరోవైపు రాజకీయంగా ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. అటు అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీల మధ్యల మాటల యుద్ధం కొనసాగుతోంది. పవన్‌ కళ్యాణ్‌తో పాటు మరికొంత మంది చంద్రబాబుకు మద్ధతు నిలుస్తుండగా, వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు చేసిన అవినీతికి సరైన శిక్ష పడిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదంతా ఇలా ఉంటే.. సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందించే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సైతం చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు.

ఇవి కూడా చదవండి

చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన నాటి నుంచి ఏదో ఒక ట్వీట్‌ చేస్తూ నెట్టింట హంగామా చేస్తూనే ఉన్నాడు వర్మ. మొన్నటి వరకు పవన్‌ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన వర్మ తాజాగా మరో సంచలన ట్వీట్‌తో తెరపైకి వచ్చాడు. చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా సోమవారం టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌పై తనదైన శైలిలో స్పందించారు వర్మ. బంద్‌ జరిగిన తీరుపై ఓ సెటైరికల్ ట్వీట్ చేశాడు.

ఇంతకీ వర్మ ట్వీట్ ఏంటంటే..

ఏపీ బంద్‌పై స్పందించిన వర్మ.. ‘మై నాట్ డియర్ ఏపి ప్రజలారా, నలభై సంవత్సారాల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మీకు పగలు రాత్రి సేవ చేసిన వారిని , లోపలికేసినందుకు బంద్‌కు పిలిస్తే , ఏ మాత్రం కేర్ చెయ్యకుండా మీ పనులు చేసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, షాపింగ్‌లు చేసుకున్నారా ??? అవ్వ !!! ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా?’’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. వర్మ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..