చెరుకు రైతులకు రూ. 10 కోట్ల బకాయిపడ్డ షుగర్ ఫ్యాక్టరీ.. జహీరాబాద్‌లో చెరుకు రైతుల భారీ నిరసనలు..

Sugarcane Farmers Protest: తమ సమస్యల పరిష్కారం కోసం వేచి,వేచి అవి తీరకపోవడంతో రోడ్డు పైకి ఎక్కి నిరసన తెల్పారు చెరుకు రైతులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో చెరుకు రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు..స్థానికంగా ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని,కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. అలాగే ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ నుండి రైతులకు రావాల్సిన 10 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని..

చెరుకు రైతులకు రూ. 10 కోట్ల బకాయిపడ్డ షుగర్ ఫ్యాక్టరీ.. జహీరాబాద్‌లో చెరుకు రైతుల భారీ నిరసనలు..
Sugarcane Farmers
Follow us
P Shivteja

| Edited By: Sanjay Kasula

Updated on: Sep 12, 2023 | 9:15 PM

జహీరాబాద్‌, సెప్టెంబర్ 12: ఎప్పుడు తీపిని పండించే రైతుల బతుకులు చేదు అయ్యాయి. తమ సమస్యల పరిష్కారం కోసం వేచి,వేచి అవి తీరకపోవడంతో రోడ్డు పైకి ఎక్కి నిరసన తెల్పారు చెరుకు రైతులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో చెరుకు రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు..స్థానికంగా ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని,కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. అలాగే ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ నుండి రైతులకు రావాల్సిన 10 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని లేని పక్షంలో ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు చెరుకు రైతులు.

ఇక్కడ ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రతి సంవత్సరం ఇదే సమస్య తలెత్తుతున్నది అని, స్థానిక నేతలు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు.. ఇంకో 20 రోజులు అయితే చెరుకు పంట చేతికి వస్తుంది అని,కానీ ఇప్పటికి వరకు ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీని ఓపెనింగ్ కోసం చేసే పనులు ప్రారంభం కాలేదు అని అంటున్నారు రైతులు..ఈరోజు ఇదే విషయం పై సుమారు 1000 మంది రైతులు జహీరాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.. జహీరాబాద్ ప్రాంతంలో సుమారు 20 లక్షల ఎకరాల్లో చెరుకు సాగు అవుతుంది..

ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ అత్యధికంగా చెరుకు పంటను సాగు చేస్తున్నారు..అయితే పండించిన చెరుకును అమ్ముకోవడానికి ఇక్కడి రైతులు నానా అవస్థలు పడుతున్నారు…ఇక్కడే ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ తిప్పలు తప్పడం లేదు ఈ ప్రాంత రైతులకి…

ప్రతి ఏటా చెరుకు పంట చేతికి వస్తోంది అనగానే చెరుకు రైతులకు భయం పుడుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఈ షుగర్ ఫ్యాక్టరీ నడుస్తుందో,ఎప్పుడు మూతపడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది అంటున్నారు రైతులు.. ఒకవేళ ఈ ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ రైతుల నుంచి చెరుకును కొనుగోలు చేసిన వాటి డబ్బులను సరైన సమయంలో ఇవ్వకుండా, రైతులను ముప్పు తిప్పలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఇప్పటికి ఇంకా 10 కొట్ల రూపాయలను పెడింగ్ లో పెట్టింది షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం… ఎన్నిసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసిన కంపెనీ యాజమాన్యంలో మాత్రం మార్పు రావడంలేదు..

దీనికితోడు ఇంకో నెలరోజులు అయితే చెరుకు పంట చేతికి వస్తుంది..అయితే ఈ పాటికే అంటే మూడు నెలల క్రితం ముందునుండే ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు క్రషింగ్ కు ప్రిపేర్ కావాలి.. కానీ ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి లేదు అక్కడ. అసలు ఈ కంపెనీ ఉంటుందా పోతుందా అనే అనుమానం వ్యక్తం అవుతుంది అని ఆందోళనలో ఉన్నారు రైతులు.. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు జహీరాబాద్ ప్రాంత రైతులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం