AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddipet: నెత్తురోడిన రహదారి.. ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు మృతి, 8మందికి తీవ్రగాయాలు

Siddipet: వీరంతా సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు.. 11 మంది విద్యార్థులు వారికి సంబంధించి పరీక్షలు రాయడానికి కరీంనగర్ లోని తిమ్మాపూర్ కి ప్రైవేటు వాహనం క్వాలిస్ ని తీసుకొని వెళ్లారు. పరీక్షలంతా సజావుగా రాసుకొని ఇంటికి తిరుగు ప్రయాణం పట్టారు. రోడ్డు ప్రయాణమంతా సాఫీగా సాగింది. మరికొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనగా..

Siddipet: నెత్తురోడిన రహదారి.. ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు మృతి, 8మందికి తీవ్రగాయాలు
Road Accident
P Shivteja
| Edited By: Jyothi Gadda|

Updated on: Sep 12, 2023 | 7:35 PM

Share

సిద్దిపేట,సెప్టెంబర్12: ఎన్నో కలలతో భవిష్యత్తును ఊహించుకున్న విద్యార్థులు కానరాని లోకాలకు వెళ్లిపోయారు.. ఊహించని రోడ్డు ప్రమాదం ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇసుక లారీ రూపంలో మృత్యువు ముగ్గురు విద్యార్థులను కబలించింది..ఒకే కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించడంతో వారి కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి..తోటి మిత్రులందరు దిగ్భ్రాంతికి గురయ్యారు.. ముగ్గురు విద్యార్థులు ఒకేసారి మృత్యువాతపడటంతో వారి గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు ఆశులు భాషలు వీరంతా సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నా 11 మంది విద్యార్థులు వారికి సంబంధించి పరీక్షలు రాయడానికి కరీంనగర్ లోని తిమ్మాపూర్ కి ప్రైవేటు వాహనం క్వాలిస్ ని తీసుకొని వెళ్లారు. పరీక్షలంతా సజావుగా రాసుకొని ఇంటికి తిరుగు ప్రయాణం పట్టారు.  రోడ్డు ప్రయాణం అంతా సురక్షితంగా చేరి ఇంటికి ఇంకొద్ది దూరంలో ఉన్నాము అన్న సమయంలో అనంతసాగర్ శివారులో ఆగి ఉన్న ఇసుక లారీని ఈ విద్యార్థులకు సంబంధించిన కాలీస్ వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో పడివున్నవిద్యార్థులను స్థానికుల సాయంతో సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించి చికిత్స అందజేస్తున్నారు.

మరణించిన విద్యార్థుల్లో ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి నితిన్ ,గ్రీష్మ ,నమత్రగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా మిత్రుల రోదనలతో శోక సముద్రంగా మారిపోయింది. రోడ్డు ప్రమాదం విద్యార్థుల జీవితాలకు చరమగీతం పాడింది..

ఇవి కూడా చదవండి

సిద్ధిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదం సమాచారం తెలిసిన మంత్రి మంత్రి హరీష్ రావు వెంటనే స్పందించారు. విద్యార్థుల పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్