Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్ర ముఖ్యమంత్రినే ఇరుకున పడేసిన రెహమాన్‌ కాన్సర్ట్‌..! అభిమానుల ఆగ్రహం..స్పందించిన రెహమాన్, పోలీసులు..

కార్యక్రమం జరిగే ప్రాంగణానికి వచ్చింది కేవలం 40 వేల మంది మాత్రమే.. ఇంకా వేలల్లో టికెట్లు కొనుగోలు చేసినవారు ఇవెంట్‌ జరుగుతున్న ప్రాంతం వరకు రాలేక పోయారు.. వచ్చినవారికి స్థలం లేదు.. ఒక్కో టికెట్టు ధర 2 వేల నుంచి 20 వేల వరకు ఉంది.. అయినా కార్యక్రమం చూడలేక పోయారు.. అక్కడ జరిగిన తొక్కిసలాట లో వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.. వారందరినీ ఆస్పత్రికి తరలించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రినే ఇరుకున పడేసిన రెహమాన్‌ కాన్సర్ట్‌..! అభిమానుల ఆగ్రహం..స్పందించిన రెహమాన్, పోలీసులు..
Ar Rahman Concert
Follow us
Ch Murali

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 12, 2023 | 7:50 PM

ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సెర్ట్ కాంట్రవర్సీలో చిక్కుకుంది. చెన్నై నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో తలెత్తిన సమస్యపై దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో డిస్కషన్ వైరల్ గా మారింది. అదే కాన్సెర్ట్ తో సీఎం స్టాలిన్ కు ఇబ్బందులు తప్పలేదు. ఇంతకీ అంతలా ఏం జరిగింది ఓ సారి చూద్దాం.. చెన్నై మహానగరం ఈస్ట్ కోస్ట్ రోడ్(ఈసీఆర్) లోని పన్నయూర్ లో భారీ సెట్ వేశారు. ఎసిటిసి ఈవెంట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సెర్ట్ జరిగింది. గత ఆదివారం ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ టికెట్లు ఆన్లైన్లో విక్రయాలకు పెట్టింది. సుమారు లక్షకు పైగా టికెట్లు అమ్మకాలు జరిగాయి.. ఈవెంట్ జరిగే సమయం రానే వచ్చింది.. వెన్యూ బయట భారీ జనం.. వెన్యూ ప్రాంగణం పూర్తిగా ప్రేక్షకులతో నిండిపోయింది. రోడ్డుపై ఇంకా భారీగా జనం.. లోనికి వెళ్ళడానికి ఖాళీ లేదు.. అప్పటికే లోపలకు వెళ్లిన వారికి స్థలం లేదు. ఇంకా ఈసీఆర్ వైపు పన్నయూర్ కు క్యూ కట్టారు మ్యూజిక్ లవర్స్..

అదే సమయంలో తన పర్యటన ముగించుకుని నివాసానికి వెళుతున్న సీఎం స్టాలిన్ కాన్వాయ్ ఆ ప్రాంతానికి చేరుకుంది. ట్రాఫిక్ లో సీఎం కాన్వాయ్ లోని వాహనాలు అంగుళం కూడా ముందుకు కదలలేదు.. సుమారు అర్ధ గంటపాటు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో దారి మళ్లించి మరో మార్గంలో సీఎం ను ఇంటికి తీసుకెళ్లారు పోలీసులు. సుమారు మూడు గంటలకు పైగా ఆలస్యం అయ్యింది.. ఇక్కడ సీఎం స్టాలిన్ కన్నా ఇబ్బంది పడింది వేలాదిమంది ప్రజలు. కార్యక్రమం జరిగే ప్రాంగణానికి వచ్చింది కేవలం 40 వేల మంది మాత్రమే.. ఇంకా వేలల్లో టికెట్లు కొనుగోలు చేసినవారు ఇవెంట్‌ జరుగుతున్న ప్రాంతం వరకు రాలేక పోయారు.. వచ్చినవారికి స్థలం లేదు.. ఒక్కో టికెట్టు ధర 2 వేల నుంచి 20 వేల వరకు ఉంది.. అయినా కార్యక్రమం చూడలేక పోయారు.. అక్కడ జరిగిన తొక్కిసలాట లో వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.. వారందరినీ ఆస్పత్రికి తరలించారు.

దీంతో ఇలాంటి ఇబ్బందికర ప్రయత్నం చేసినందుకు.. ఇంతమందిని ఇబ్బందులకు గురిచేసిన వారిపై చర్యలకు ఆదేశించింది ప్రభుత్వం. అంతకన్నా ఇలాంటి కార్యక్రమానికి అవగాహన.. ముందస్తు అంచనా గుర్తించలేక పోవడం పోలీసు అధికారుల వైఫల్యంగా గుర్తించి చర్యలకు ఆదేశించింది. ఫలితంగా సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. పల్లికరణై డిప్యూటీ కమిషనర్ సత్య, చెన్నై సిటి ఈస్ట్ జాయింట్ పోలీస్ కమిషనర్ ను ఆకస్మిక బదిలీ చేసిన డిజిపి వారికి ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. అలాగే మరో నలుగురు ఉన్నతాధికారులను కూడా పోలీస్ బాస్ బదిలీ చేశారు. ఇక ఈవెంట్ వల్ల జరిగిన ఇబ్బందిపై ఎఆర్ రెహమాన్ స్పందించారు. అందరికి క్షమాపణ చెబుతూ టికెట్లు కొనుగోలు చేసి కాన్సెర్ట్ కు రాలేకపోయిన వారికి నగదు రిటర్న్ చేస్తానని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..