Tallest Dog: ప్రపంచంలోనే ఎత్తైన కుక్కగా గిన్నిస్‌ రికార్డుకెక్కిన జుయస్‌కు క్యాన్సర్‌..పలువురి సంతాపం..

జుయస్‌ 8 వారాల వయస్సులో ఉన్నప్పుడు ఈ కుటుంబం దానిని దత్తత తీసుకున్నారు. అమెరికన్ గ్రేట్ డేన్ జాతికి చెందిన ఈ కుక్కలు సాధారణంగా ఐదేళ్ల కాలానికి గాని ఇంత ఎత్తు పెరగవు. అయితే జుయస్‌ మాత్రం రెండేళ్లకే మూడు అడుగులు పెరిగింది. తక్కువ జీవితకాలంలో ప్రపంచంలో ఎత్తైన కుక్కగా రెకార్డుకెక్కింది.

Tallest Dog: ప్రపంచంలోనే ఎత్తైన కుక్కగా గిన్నిస్‌ రికార్డుకెక్కిన జుయస్‌కు క్యాన్సర్‌..పలువురి సంతాపం..
Worlds Tallest Dog
Follow us

|

Updated on: Sep 13, 2023 | 3:26 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కుక్క క్యాన్సర్‌ బారిన పడింది. జుయస్‌ అనే కుక్క ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కుక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ కుక్క ఎత్తు 2022లో కొలిచినప్పుడు దాని పొడవు 1.46 మీటర్లు (3 అడుగుల 5.18 అంగుళాలు)గా ఉంది. కానీ పాపం ఈ కుక్కకు ప్రాణాంతక క్యాన్సర్ ఉందని తెలిసింది. దాంతో కుక్కను క్యాన్సర్ నుండి రక్షించడానికి దాని ముందు కుడి కాలును తొలగించాల్సి వచ్చిందని ఆ తరువాత తెలిసింది. అయితే శస్త్రచికిత్స తర్వాత న్యుమోనియా కారణంగా మూడేళ్ల కుక్క జుయస్‌ సెప్టెంబర్‌ 12న చనిపోయిందని దాని యజమాని తెలిపారు.

జుయస్‌ యజమాని, డోనీ డేవిస్ ఒడిలో పడుకుని మరణించిదని చెప్పాడు. కుక్కను రక్షించేందుకు పశువైద్యులు ఎంతగానో ప్రయత్నించినా కాపాడలేకపోయారని తెలిపారు. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే జీవించి మరణించింది ఈ కుక్క జుయస్‌. ఒక సాధారణ మనిషి పక్కన నిలబడి ఉన్నప్పుడు..చూసేందుకు జుయస్‌ ఒక చిన్నపాటి గుర్రంలాగే కనిపించేది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర బెడ్ ఫోర్డ్ కి చెందిన బ్రిటనీ డేవిస్ కుటుంబం ఈ కుక్క జుయస్‌ను పెంచుకుంటుంది. అమెరికన్ గ్రేట్ డేన్ జాతికి చెందిన ఈ కుక్కలు సాధారణంగా ఐదేళ్ల కాలానికి గాని ఇంత ఎత్తు పెరగవు. అయితే జుయస్‌ మాత్రం రెండేళ్లకే మూడు అడుగులు పెరిగింది. తక్కువ జీవితకాలంలో ప్రపంచంలో ఎత్తైన కుక్కగా రెకార్డుకెక్కింది. దాని యజమానులు జుయస్‌ మరణానికి సంతాపం తెలిపారు. జుయస్‌ ముందుగా క్యాన్సర్ బారినపడింది. ఆ తర్వాత న్యుమోనియాతో కూడా సోకడంతో మరణించినట్టుగా చెప్పారు. చనిపోయిన జుయస్‌ వయసు కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమేనని ఆ కుక్క యజమాని తెలిపారు. జుయస్‌ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే జీవించినప్పటికీ అది ఎంతో చురుగ్గా ఉండేదని చెప్పారు. జుయస్‌ నివసించిన ఇంటికి ఇరుగుపొరుగు వారు, బంధువులు దానిని చూడటం కోసం వచ్చేవారు. ఎంతో సౌమ్యంగా కనిపించే జుయస్‌ అందరితోనూ కలిసి పోయి ఉండేదని కుటుంబీకులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

జుయస్‌ తో గడిపిన క్షణాలు ఎంతో మధురమైనవిగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. జుయస్‌ మరణానికి సంతాపం తెలిపిన ప్రతి ఒక్కరికీ దాని యజమాని ధన్యవాదాలు తెలిపారు. జుయస్‌ 8 వారాల వయస్సులో ఉన్నప్పుడు ఈ కుటుంబం దానిని దత్తత తీసుకున్నారు. వేగంగా పెరుగుతున్న జుయస్‌ తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగేవాడని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు