US Police: మరోసారి బయటపడ్డ అమెరికా పోలీసుల రేసిజం.. తెలుగు స్టూడెంట్‌ మరణంపై వెకిలి కామెంట్స్‌..

US Police Comments: అమెరికా పోలీసుల కండకావరం మరోసారి బయటపడింది. సియాటెల్‌లో యాక్సిడెంట్‌లో చనిపోయిన తెలుగు విద్యార్ధిని కందుల జాహ్నవి ప్రాణాలకు విలువ లేదంటూ దర్యాప్తు అధికారి చేసిన వ్యాఖ్యలపై రచ్చ జరుగుతోంది. తెలుగు విద్యార్థిని మరణానికి కారణమైన ఘటనపై సరదాగా జోకులు వేస్తూ భారతీయ విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదంటూ ఓ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తమవుతోంది.

US Police: మరోసారి బయటపడ్డ అమెరికా పోలీసుల రేసిజం.. తెలుగు స్టూడెంట్‌ మరణంపై వెకిలి కామెంట్స్‌..
Indian Student Jaahnavi Kandula Killed In Accident US
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 13, 2023 | 2:56 PM

US Police Comments: అమెరికా పోలీసుల కండకావరం మరోసారి బయటపడింది. సియాటెల్‌లో యాక్సిడెంట్‌లో చనిపోయిన తెలుగు విద్యార్ధిని కందుల జాహ్నవి ప్రాణాలకు విలువ లేదంటూ దర్యాప్తు అధికారి చేసిన వ్యాఖ్యలపై రచ్చ జరుగుతోంది. తెలుగు విద్యార్థిని మరణానికి కారణమైన ఘటనపై సరదాగా జోకులు వేస్తూ భారతీయ విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదంటూ ఓ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తమవుతోంది. అమెరికాలోని సియాటెల్‌ పోలీసు శాఖకు చెందిన ఒక పోలీసు అధికారికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన 23 సంత్సరాల కందుల జాహ్నవి సౌత్ లేక్‌లోని నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 23న థామస్ స్ట్రీస్‌లోని డెక్స్‌టర్ అవెన్యూ నార్త్ సమీపంలో.. జాహ్నవి రోడ్డుపై నడుస్తుండగా కెవిన్ డేవ్ అనే సీటెల్‌కు చెందిన పోలీసు అధికారి ఆడెరర్ నడుపుతున్న కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో జాహ్నవి తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయింది.

ఈ క్రమంలో జాహ్నవి మృతిపై సియాటెల్‌ పోలీసు అధికారుల గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్‌ ఆడెరెర్ కారు నడుపుతూ చేసిన సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగు చూసింది. గిల్డ్ అధ్యక్షుడు మైక్ సోలన్‌తో ఫోన్‌లో ఆడరర్ మాట్లాడుతూ జాహ్నవి విలువ చాలా తక్కువ అంటూ ఆమె ప్రాణానికి విలువే లేదంటూ ఎగతాళిగా కామెంట్‌ చేశాడు. ఆమె చనిపోయింది అంటూ గట్టిగా నవ్వడమే గాక.. ఇదంతా మామూలే అంటూ భారతీయ విద్యార్థిని మరణాన్ని చాలా తేలికగా తీసిపారేశాడు.

11,000 డాలర్లకు చెక్ రాస్తే చాలు.. ఆమెకు 26 ఏళ్లు. ఆమెకు విలువ చాలా తక్కువ అంటూ ఆడెరర్‌ చేసిన వ్యాఖ్యలు.. భారతీయ విద్యార్థిని పట్ల ఒక అమెరికన్ పోలీసుకు ఉన్న చిన్న చూపు (రేసిజం).. ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది. కారును గంటకు 50 మైళ్ల వేగంతో నడుపుతున్నాడని, ఒక శిక్షణ పొందిన డ్రైవర్‌కు అది చాలా తక్కువ వేగమని కూడా ఆడరర్ సర్టిఫై చేశాడు.

అయితే, జాహ్నవి మరణంపై పోలీసులు జరిపిన దర్యాప్తులో డేవ్ గంటకు 74 మైళ్ల వేగంతో కారు నడిపినట్లు తేలింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గంలకు 25 మైళ్లకు మించి వేగంగా వాహనాలు నడపడానికి వీల్లేదు. డేవ్ వేగంగా నడిపిన కారు ఢీకొని.. జాహ్నవి 100 అడుగుల మేర దూరంలో ఎగిరిపడి మరణించింది.

ఆడెరర్‌ వీడియో సంభాషణకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు, ప్రవాస భారతీయలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీటెల్ పోలీసు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..