AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit: చైనా ప్రతినిధుల బ్యాగుల్లో ఏమున్నాయ్?.. 5 స్టార్ హోటల్‌లో 12 గంటల హైడ్రామా.. చివరకు..

China G20 Delegates: భారత్ వేదికగా నిర్వహించిన జీ20-2023 సమ్మిట్ విజయవంతమైన విషయం తెలిసిందే. ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 జరిగిన శిఖరాగ్ర సమావేశానికి జీ20 దేశాధినేతలు హాజరయ్యారు. వీరితో పాటు ఆహ్వానిత దేశాలకు సంబంధించిన మరో 20 దేశాలకు చెందిన ప్రతినిధులు సైతం హాజరయ్యారు. శిఖరాగ్ర సదస్సు అనంతరం ఆయా అధినేతలు ఒక్కొక్కరుగా వారి వారి దేశాలకు వెళ్లిపోయారు.

G20 Summit: చైనా ప్రతినిధుల బ్యాగుల్లో ఏమున్నాయ్?.. 5 స్టార్ హోటల్‌లో 12 గంటల హైడ్రామా.. చివరకు..
G20 Summit
Shaik Madar Saheb
|

Updated on: Sep 13, 2023 | 1:42 PM

Share

China G20 Delegates: భారత్ వేదికగా నిర్వహించిన జీ20-2023 సమ్మిట్ విజయవంతమైన విషయం తెలిసిందే. ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 జరిగిన శిఖరాగ్ర సమావేశానికి జీ20 దేశాధినేతలు హాజరయ్యారు. వీరితో పాటు ఆహ్వానిత దేశాలకు సంబంధించిన మరో 20 దేశాలకు చెందిన ప్రతినిధులు సైతం హాజరయ్యారు. శిఖరాగ్ర సదస్సు అనంతరం ఆయా అధినేతలు ఒక్కొక్కరుగా వారి వారి దేశాలకు వెళ్లిపోయారు. అయితే, ఈ సమావేశానికి చైనా దేశానికి సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరయ్యారు. చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ మాత్రం హాజరుకాలేదు.. అయితే, చైనా నుంచి వచ్చిన డెలిగేట్స్ 5 స్టార్ హోటల్ తాజ్ ప్యాలెస్‌లో బస చేశారు. వారు వెళ్లే క్రమంలో తాజ్ ప్యాలెస్‌లో హైడ్రామా కొనసాగింది.

చైనా డెలిగేట్స్‌లోని ఓ సభ్యుడికి చెందిన రెండు బ్యాగుల్లో అనుమానాస్పద పరికాలు ఉన్నాయనే విషయాన్ని హోటల్ స్టాఫ్‌నకు చెందిన ఒక వ్యక్తి గమనించాడు. దీంతో ఈ విషయంపై వెంటనే సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో హుటాహుటిన భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఆ రెండు బ్యాగులను స్కానర్‌లో ఉంచాలని చైనా అధికారులను సెక్యూరిటీ సిబ్బంది కోరారు. అయితే స్కానర్‌లో బ్యాగులను ఉంచేందుకు చైనా అధికారులు నిరాకరించారు. దీంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది హోటల్ నుంచి బయటకు రానివ్వలేదు. ఈ సమయంలో తాజ్ హోటల్ లో దాదాపు 12 గంటల సేపు హైడ్రామా కొనసాగింది.

ఈ క్రమంలో చైనీస్ డెలిగేట్స్‌కు, మన అధికారులకు మధ్య సుదీర్ఘమైన చర్చ కొనసాగింది. చర్చల తర్వాత చివరకు చైనా డెలిగేట్స్ బ్యాగులకు చైనీస్ ఎంబసీకి తరలించేందుకు అధికారులు అనుమతించారు. దీంతో వారు హోటల్ నుంచి 12 గంటల తర్వాత బయటకు వచ్చారు. ఇంకోవైపు, జీ20 సమ్మిట్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకాని సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రధాని లి క్వియాంగ్ హాజరయ్యారు.

అయితే, తాజ్ ప్యాలెస్ హోటల్‌లోని భద్రతా సిబ్బంది దౌత్యపరమైన ప్రోటోకాల్‌లను అనుసరించి వారి బ్యాగులను అనుమతించినట్లు అధికారులు తెలిపారు. చైనా ప్రతినిధులు స్కానర్‌లో ఉంచేందుకు ఎందుకు ప్రతిఘటించారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దౌత్యపరమైన విషయాలను పక్కనపెడితే.. ఇంతకీ ఆ బ్యాగుల్లో ఏం ఉన్నాయి..? ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బంది చెప్పినట్లు ఏమైనా అనుమానాస్పద పరికరాలు ఉన్నాయా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. చివరకు చర్చల తరువాత అధికారులు తీసుకున్న నిర్ణయం గురించి కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..