AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్‌ కలిగి ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..? టాటా, అంబానీ, బిల్ గేట్స్‌లను మించిన అపర కుబేరుడు..!

ప్రైవేట్ విమానం 800 మందిని తీసుకువెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. విమానంలో 10-సీటర్ డైనింగ్ హాల్, లగ్జరీ బెడ్‌రూమ్, ప్రార్థన గది, వినోద గది, హోమ్ థియేటర్ సిస్టమ్, స్పా కూడా ఉన్నాయి. విమానంలో చేసిన మార్పులు, లగ్జరీ ఏర్పాట్ల కారణంగా ప్రిన్స్ యాజమాన్యంలోని ప్రైవేట్ జెట్ మోడల్ మొత్తం ఖర్చు దాదాపుగా..

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్‌ కలిగి ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..? టాటా, అంబానీ, బిల్ గేట్స్‌లను మించిన అపర కుబేరుడు..!
Saudi Prince
Jyothi Gadda
|

Updated on: Sep 13, 2023 | 4:41 PM

Share

మన దేశంలో ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ వంటి చాలా మంది సూపర్ రిచ్ వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ బిలియనీర్లు విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నారు. వేలకొద్దీ కార్లు, బంగ్లాలు, లెక్కలేనన్ని ఆస్తులను కలిగి ఉన్నారు. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ యజమాని కూడా ఒకరు ఉన్నారు. కానీ, అతను మన భారతీయుడు మాత్రం కాదని సమాచారం. అయితే, ఆయన ఎవరు..? అనే సందేహం కలుగక మానదు..అంబానీ, టాటా విన్‌ల కంటే నికర విలువ రూ.4100 కోట్ల విలువైన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్‌ అతని సొంతం. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ యజమాని అంబానీ, అదానీ, టాటా కాకుండా ఇంకెవరా అని ఆలోచిస్తున్నట్టయితే..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ కలిగిన వ్యక్తి సౌదీ అరేబియా యువరాజు, వ్యాపారవేత్త అల్ వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్‌కు చెందినది.

సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ అల్-సౌద్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్‌ను కలిగి ఉన్నారని సమాచారం. అతను ప్రముఖ మధ్యప్రాచ్య రాజకుటుంబంలో సభ్యుడు. అత్యంత ఆస్తిపాస్తులు కలిగిన సుసంపన్నుడు. అతని నికర ఆస్తుల విలువ USD 500 మిలియన్లు. అంటే భారత కరెన్సీలో దాదాపుగా రూ.4,143 కోట్లు. అంబానీ, టాటా ఇద్దరూ ప్రైవేట్ జెట్‌లను కలిగి ఉన్నప్పటికీ, వాటి విలువలతో పోలిస్తే తక్కువేనని సమాచారం.

బోయింగ్ 747 అనే ప్రైవేట్ జెట్ బోయింగ్ 747 వ్యాపారవేత్త అల్ వలీద్ బిన్ తలాల్ అల్-సౌద్ యాజమాన్యంలో ఉంది. దీని ధర సాధారణంగా USD 150 మిలియన్ నుండి 200 మిలియన్లు. విమానంలో చేసిన మార్పులు, లగ్జరీ ఏర్పాట్ల కారణంగా ప్రిన్స్ యాజమాన్యంలోని ప్రైవేట్ జెట్ మోడల్ మొత్తం ఖర్చు USD 500 మిలియన్ కంటే ఎక్కువేనని సమాచారం. తలాల్ అల్-సౌద్ ప్రైవేట్ విమానం 800 మందిని తీసుకువెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. విమానంలో 10-సీటర్ డైనింగ్ హాల్, లగ్జరీ బెడ్‌రూమ్, ప్రార్థన గది, వినోద గది, హోమ్ థియేటర్ సిస్టమ్, స్పా కూడా ఉన్నాయి. వార్తా కధనాల ప్రకారం.. అల్ వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ నికర విలువ రూ. 1.55 లక్షల కోట్లు. ఇది రతన్ టాటా, ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ.

ఇవి కూడా చదవండి

భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ వద్ద రూ.603 కోట్ల విలువైన బోయింగ్ బిజినెస్ జెట్‌ఉంది. . అదానీ గ్రూప్‌కు చెందిన గౌతమ్ అదానీకి అనేక ప్రైవేట్ జెట్‌లు కూడా ఉన్నాయి. వీటిలో బొంబార్డియర్ ఛాలెంజర్ 605, ఎంబ్రేయర్ లెగసీ 650, హాకర్ బీచ్‌క్రాఫ్ట్ 850XP ఉన్నాయి.

టాటా గ్రూప్‌కు చెందిన రతన్ టాటా అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ మోడల్‌లలో ఒకటైన డస్సాల్ట్ ఫాల్కన్ 2000ని ఉంది. దీని ధర రూ.200 కోట్లు ఉంటుంది. ప్రైవేట్ జెట్‌లను కలిగి ఉన్న ఇతర బిలియనీర్లు ఎలోన్ మస్క్, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..