Recurring Deposits: బ్యాంకు వర్సెస్ పోస్ట్ ఆఫీసు.. అధిక వడ్డీతో పాటు బహుళ ప్రయోజనాలు ఇచ్చేది ఏది? తెలుసుకుందాం రండి..
బహుళ ప్రయోజనాలు అందించే స్కీమ్ రికరింగ్ డిపాజిట్. దీనినే ఆర్‌డీ అని పిలుస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ బ్యాంకుల్లో ఈ ఖాతాను ప్రారంభించే అవకాశం ఉంది. ప్రతి నెలా చిన్న మొత్తాలతో ప్రారంభించి, పెద్ద మొత్తంలో రాబడి పొందే మార్గం దీనిలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), హెచ్ డీఎఫ్సీ వంటి బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఈ ఆర్ డీ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కో దగ్గర ఒక్కో రకమైన వడ్డీ రేట్లు ఉంటాయి.
ప్రజలు ఇటీవల కాలంలో పొదుపు పథకాల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో ఫిక్స్ డ్ డిపాజిట్ వంటి పథకాలలో పెట్టుబడి పెడుతున్నారు. అధిక వడ్డీతో పాటు భద్రతా, భరోసా ఉంటుండటంతో అందరూ వాటిపై మొగ్గుచూపుతారు. అయితే దీనితో పాటు సరిసమానంగా ప్రయోజనాలు అందించే స్కీమ్ రికరింగ్ డిపాజిట్. దీనినే ఆర్‌డీ అని పిలుస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ బ్యాంకుల్లో ఈ ఖాతాను ప్రారంభించే అవకాశం ఉంది. ప్రతి నెలా చిన్న మొత్తాలతో ప్రారంభించి, పెద్ద మొత్తంలో రాబడి పొందే మార్గం దీనిలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), హెచ్ డీఎఫ్సీ వంటి బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఈ ఆర్ డీ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కో దగ్గర ఒక్కో రకమైన వడ్డీ రేట్లు ఉంటాయి. దేనిలో వడ్డీ ఎక్కువ వస్తుందో అక్కడ అకౌంట్ తీసుకుంటే అధిక లాభం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీసు, స్టేట్ బ్యాంక్ ఇండియా లలో దేనిలో ఆర్ డీలకు అధిక వడ్డీ ఉంటుందో తెలుసుకుందాం రండి..
రికరింగ్ డిపాజిట్లలో ఇవి ఉంటాయి..
ప్రజలలో సాధారణ పొదుపు అలవాటును పెంపొందించడానికి రికరింగ్ డిపాజిట్ ప్లాన్‌లు అందిస్తాయి. బ్యాంకులో ఆర్డీ ఖాతాను ప్రారంభించడానికి కనీస నెలవారీ పెట్టుబడి రూ. 100 మాత్రమే. మీరు గణనీయమైన అదనపు ఆదాయాన్ని కలిగి ఉంటే రికరింగ్ డిపాజిట్లు సముచితమైనవి. ప్రతి నెలా చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వ్యక్తులకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది పోస్టాఫీసు ఆర్డీ ఖాతాల్లో నెలకు రూ.10 పెట్టుబడి పెట్టవచ్చు. ఒక వ్యక్తి 6 నెలలు నుంచి 10 సంవత్సరాల వ్యవధితో రికరింగ్ డిపాజిట్ ఖాతాను ప్రారంభించవచ్చు. ఇవి మీకు అత్యంత అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తాయి. రికరింగ్ డిపాజిట్ ఖాతా 30 రోజుల నుంచి 3 నెలల వరకు లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటుంది
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌డీ.. పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ మధ్య తేడాలు..
ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్‌లను ఒక సంవత్సరం నుంచి పదేళ్ల కాల వ్యవధితో అందిస్తుంది. ప్రతి నెలా కనిష్టంగా రూ. 100 నుంచి డిపాజిట్లు స్వీకరిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ ప్రజలకు 6.5 శాతం నుంచి 7 శాతం వరకు మరియు సీనియర్ సిటిజన్లకు 7 శాతం నుండి 7.5 శాతం వరకు రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15, 2023 నుంచి అమలులోకి వచ్చాయి.
ఎస్బీఐ వడ్డీ రేట్లు ఇలా..
- 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలలోపు వ్యవధితో సాధారణ ప్రజలకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు, 7.30 శాతం వడ్డీ ఉంటుంది.
- 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల లోపు ఆర్డీపై సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ ఇస్తారు.
- 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు ఆర్డీపై సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం వడ్డీ రేటు అందిస్తారు.
- 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వ్యవధితో సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేటు వస్తుంది.
పోస్టాఫీసు ఆర్డీలు..
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. కనిసం రూ. 100 నుంచి రూ. 10 గుణిజాలలో ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. దీనిలో సీనియర్ సిటిజన్లు ఎలాంటి అదనపు వడ్డీ రేటు ప్రయోజనాలను పొందరు. కొత్త రేట్లు జూలై 1, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ వడ్డీ రేటు ఐదేళ్లకు 6.5 శాతం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..