AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మో.. యమ డేంజర్ ఘజియాబాద్ గ్యాంగ్.. చెడ్డి గ్యాంగ్.. పార్ధు గ్యాంగ్ ను మించిన ఘరానా దొంగలు వీళ్ళు..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ తో పాటు, ఆదిలాబాద్, బెంగుళూర్ లో చోరీలు జరిగిన ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుల కదలికలకు సంబందించి సిసి కెమెరా దృష్యాలతో పాటు నిందితులు వినియోగించిన కారు ఫోటోలను సేకరించారు.. కారు నెంబర్ టోల్ గేట్ ఆధారంగా ఈ ముఠా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ వైపు వెళ్తున్నట్లు గుర్తించి.. కర్నూలు పోలీసులను అప్రమత్తం చేశారు..

అమ్మో.. యమ డేంజర్ ఘజియాబాద్ గ్యాంగ్.. చెడ్డి గ్యాంగ్.. పార్ధు గ్యాంగ్ ను మించిన ఘరానా దొంగలు వీళ్ళు..
Arrested Ghaziabad Gang
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Sep 13, 2023 | 5:19 PM

Share

వరంగల్,సెప్టెంబర్13: అమ్మో.. యమ డేంజర్ ఘజియాబాద్ గ్యాంగ్.. చెడ్డి గ్యాంగ్.. పార్ధు గ్యాంగ్ ను మించిన ఘరానా దొంగలు వీళ్ళు..ఒకటికాదు రెండుకాదు ఆరు రాష్ట్రాల్లో వరుస దోపిడీలతో షేక్ చేశారు. కారులో వచ్చి క్లాస్ గా దోచుకు పోయారు..పాపం పండి వరంగల్ పోలీసుల చేతికి చిక్కారు. ఆ ముఠా నుండి కిలోల కొద్ది బంగారం, వజ్రాల అభరణాలు, తుపాకీ దొరికింది.. కార్లలో వచ్చి క్లాస్ గా దోచుకుపోయే డేంజర్ దొంగలంతా యూపీ కి చెందిన ఒకే కుటుంబంగా వరంగల్ పోలీసులు గుర్తించారు.. ఢిల్లీ నుండి మొదలుకొని కర్ణాటక, మహారాష్ట్ర,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాలలో వరుస దోపిడీలతో హడలెత్తించారు.. వరంగల్ లో కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఏడు అపార్ట్మెంట్లలో చోరీలకు పాల్పడ్డారు..

అపార్ట్‌మెంట్లలో తాళంవేసి వున్న ఇండ్లను టార్గెట్‌గా చేసుకోని ప్రత్యేక యంత్రాలతో తాళాలు బ్రేక్ చేసి దోపిడీలకు బరి తెగించారు.. చోరీ లు మాత్రమేకాదు కారులో క్లాస్ గా గంజాయి రవాణా చేస్తున్న ఆ నలుగురు సభ్యుల ముఠా వరంగల్ పోలీసుల చేతికి చిక్కింది.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా పోలీసులు & వరంగల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో ఈ ముఠా పట్టుబడింది..

వీరి నుండి రెండు కోట్లు విలువగల సూమారు 2కిలో 380 గ్రాముల బంగారు, వజ్రాల అభరణాలు, ఐదు లక్షల 20 వేల రూపాయల విలువ గల 14కిలోల ఎండు గంజాయితో పాటు ఒక పిస్టల్, ఐదు రౌండ్లు బుల్లెట్స్, ఒక కారు, నాలుగు సెల్ఫోన్లు, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ అధార్కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు అరెస్టు చేసిన ముఠా అంతా ఓకే కుటుంబం… వారిలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ కు చెందిన మహమ్మద్ అక్బర్ ఖురేషి, కపిల్ జాటోవు, మహమ్మద్ షరీఫ్, మహమ్మద్ జాద్ ఖాన్ వున్నారు.. వీరంతా ఘజియాబాద్ కు చెందిన వారే.. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

5వ తేదిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏడు అపార్ట్మెంట్లల్లో తాళంవేసి వున్న ఎనిమిది ఫ్లాట్స్ లలో చోరీలకు పాల్పడ్డారు.. బంగారు, వెండి అభరణాలతో పాటు నగదు పహరించుకు పోయారు.. వెంటనే అప్రమత్తమైన వరంగల్ పోలీసులు దొంగలను పట్టుకునేందుకు రంగంలో కి దిగారు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ తో పాటు, ఆదిలాబాద్, బెంగుళూర్ లో చోరీలు జరిగిన ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుల కదలికలకు సంబందించి సిసి కెమెరా దృష్యాలతో పాటు నిందితులు వినియోగించిన కారు ఫోటోలను సేకరించారు.. కారు నెంబర్ టోల్ గేట్ ఆధారంగా ఈ ముఠా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ వైపు వెళ్తున్నట్లు గుర్తించి.. కర్నూలు పోలీసులను అప్రమత్తం చేశారు.. కర్నూల్ పోలీసులు ఓ టోల్ గేట్ వద్ద మాటు వేసి వీరిని పట్టేశారు.

ఈ ముఠా ఇప్పటికే పలుమార్లు పోలీసులకు చిక్కి జైలు జీవితం గడిపారు. జైలు నుండి విడుదలైన ఈ ముఠా సభ్యులు మళ్ళీ చోరీలకు తెగ బడ్డారు… ఈ ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర ముఠా పై రెండు తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా కేసులు వున్నాయి.. ఈ ముఠా పై వరంగల్ లో పీ. డీ యాక్ట్ నమోదు చేస్తున్నారు.. వీరిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన వరంగల్ – కర్నూల్ పోలీసులను సీపీ రంగనాథ్ అభినందించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..