Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: ప్లాస్టిక్ తో గర్భిణి లకు డేంజర్ అంటున్న శాస్త్రవేత్తలు…. పుట్టబోయే బిడ్డ ల పై ఎఫెక్ట్..

Hyderabad: ప్లాస్టిక్ తో రాబోయే జనరేషన్ పిల్లలకి ఎంతో ప్రమాదం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.నేషనల్ ఇన్స్టట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ చేసిన పరిశోధనలలో గర్భంతో ఉన్న మహిళలు ప్లాస్టిక్ వాడకం తో పుట్టబోయే బిడ్డలో అనేక ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు.ఇంతకీ nin శాస్త్రవేత్తల ప్లాస్టిక్ పై పరశోధనలో ఏం తేల్చారు..

Health News: ప్లాస్టిక్ తో గర్భిణి లకు డేంజర్ అంటున్న శాస్త్రవేత్తలు.... పుట్టబోయే బిడ్డ ల పై ఎఫెక్ట్..
plastic is dangerous for pregnant women
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 13, 2023 | 5:39 PM

హైదరాబాద్, సెప్టెంబర్13: ప్లాస్టిక్…మన లైఫ్ సర్కిల్ లో ఎంతో ముడిపడి ఉన్న వస్తువు. ఇది ఆరోగ్యానికి ఎంతో హానికరమని అందరికీ తెలిసిన ఎవరూ పట్టించుకోరు. ప్లాస్టిక్ వాడకం వల్ల మన ఆరోగ్యం తో పాటు పర్యావరణానికి ఇది ప్రమాదమే.. ఈ విషయాన్ని ఎంతో మంది శాస్త్రీయంగా అధ్యయనం చేసి చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన పరిశోధన రిపోర్ట్ లో భయంకర విషయాలు చెబుతుంది.

Nin తాజాగా చేసిన ప్లాస్టిక్ పరిశోధనలో గర్భిణీలు bpa కెమికల్ ప్రభావానికి గురి అయితే పుట్టబోయే బిడ్డల ఆరోగ్యం పై ఎఫెక్ట్ పడుతుంది అని సూచిస్తుంది. ఎక్కువగా ప్లాస్టిక్ ఎక్కువగా వాడిన గర్భిణి మహిళలకు పుట్టబోయే బిడ్డ అంధత్వ సమస్యలు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా మగ పిల్లల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పై ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని వారి అధ్యయన రిపోర్ట్ చెబుతుంది.

Nin శాస్త్రవేత్తల పరిశధనలో ఎలుకల పరిశోధన జరిపారు. bpa కెమికల్ ప్రభావానికి గురైన ఎలుకల కు జన్మించిన సంతానం లో సంతానోత్పత్తి సామర్థ్యం అంటే స్ప్రెం రక్షణకు కావలసిన పవర్ తగ్గినట్టు గమనించాం అని తెలిపారు. దీని వల్ల యంగ్ ఏజ్ వచ్చాక ఆ ఎలుక స్పెర్మ్ కౌంట్ తగ్గి వ్యందత్వం కి లోనవుతున్నాయని వివరించారు. తప్పకుండా మహిళలు ముఖ్యంగా గర్భిణీ మహిళలు బీపా కెమికల్ ప్లాస్టిక్ వస్తువుల వాడకంలో జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు nin శాస్త్రవేత్తలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..