Hyderabad Metro: వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. ఈసారి ఆ ఇబ్బందులకు చెక్!
మరో వారం రోజుల్లో నగరంలో గణేష్ చతుర్థి సంబరాలు ప్రారంభంకానున్నాయి. ఈ పండుగకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చి సంబురాల్లో పాలుపంచుకుంటారు. ఇక ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా ఖైరతాబాద్‌లో భారీ విగ్రహం ప్రతిష్టించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గణేష్ చతుర్థి పండుగ సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్..
హైదరాబాద్, సెప్టెంబర్ 13: మరో వారం రోజుల్లో నగరంలో గణేష్ చతుర్థి సంబరాలు ప్రారంభంకానున్నాయి. ఈ పండుగకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చి సంబురాల్లో పాలుపంచుకుంటారు. ఇక ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా ఖైరతాబాద్‌లో భారీ విగ్రహం ప్రతిష్టించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గణేష్ చతుర్థి పండుగ సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) కీలక నిర్ణయం తీసుకుంది. ఐకానిక్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని సందర్శించడానికి భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు సులువైన ప్రయాణ సౌకర్యం కల్పించడానికి సన్నద్ధమవుతోంది. గణేష్ చతుర్ధికి అవాంతరాలు లేని ప్రయాణాన్ని కల్పించడానికి మెట్రో సేవలు, భద్రతను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకోనుంది.
ఈ నేపథ్యంలో HMRL మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పండుగ సీజన్‌లో ఎప్పటి మాదిరిగానే ఏడాది కూడా రాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు పొడిగించాలని నిర్ణయించాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆలస్యంకాకుండా ఖైరతాబాద్ స్టేషన్‌కు సౌకర్యవంతంగా చేరుకోవచ్చని అని ఆయన చెప్పారు.
కాగా ప్రతి గణేష్ చతుర్ధికి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. భారీ ఎత్తు విగ్రహం వీక్షించేందుకు నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. పండుగ మొదటి రోజు నుంచే వేల మంది భక్తులు ఖైరతాబాద్‌కు వస్తుంటారు. దీంతో ఆ మార్గంలో బారీగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా HMRL అనేక అదనపు చర్యలు తీసుకుంటోంది.
ఖైరతాబాద్ స్టేషన్ సమీపంలోని కీలకమైన మెట్రో స్టేషన్లలో అదనపు టిక్కెట్ కౌంటర్ల ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా భక్తులకు ఆలస్యం కాకుండా త్వరగా టిక్కెట్లు కొనుగోలు చేసి రైళ్లలో ఎక్కే అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతకు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ స్టేషన్, ఇతర కీలకమైన మెట్రో స్టేషన్లలో అదనపు భద్రతా సిబ్బందిని మోహరింప జేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.